టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మాస్ మహారాజ్ రవితేజ తనకు ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను బాగా క్యాష్ చేసుకుంటున్నారు. రాజా ది గ్రేట్ తర్వాత సరైన హిట్ లేని రవితేజ ఈ సంవత్సరం క్రాక్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. చేతినిండా సినిమాలు ఉన్న ఈ స్టార్ హీరో దొంగాట ఫేమ్ వంశీకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనున్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటించనున్నారు.
ఈ సినిమా కొరకు రవితేజ పారితోషికం ఏకంగా 18 కోట్ల రూపాయలు కాగా ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లో నటించిన రవితేజకు పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా భారీస్థాయిలో గుర్తింపు దక్కింది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రమార్కుడు సినిమాతో రవితేజకు క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత రవితేజ జయాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మాస్ మహారాజ్ పారితోషికం మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. క్రాక్ తర్వాత రవితేజ సినిమాలకు భారీస్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో పాటు రవితేజ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులకు సైతం మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ రీజన్స్ వల్లే రవితేజ పారితోషికంను పెంచినట్లు తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని వార్తలు వస్తుండటం గమనార్హం.