Mahesh: రావిపూడికి బంపర్ ఆఫర్ ఇచ్చిన మహేష్?

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత ‘గుంటూరు కారం’ అనే సినిమా రూపొందుతుంది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఎందుకో ఈ చిత్రం షూటింగ్ చాలా ఆలస్యమైంది. 2021 లో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు ఇది. ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది అన్నారు. ఇటీవల హీరో మహేష్ బాబు కూడా సినిమా అప్పటికే వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు.

ఈ ప్రాజెక్టుని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి.. దర్శకుడు రాజమౌళితో సినిమా మొదలుపెట్టాలి అంటూ మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ రాజమౌళి – మహేష్ ల ప్రాజెక్ట్ .. స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు.సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది అని తెలుస్తుంది. లొకేషన్స్ వేటకి.. కాస్టింగ్ సెలక్షన్ కి ఎక్కువ టైం పడుతుంది అని తెలుస్తుంది. దీంతో ఈ గ్యాప్ లో మరో సినిమా కంప్లీట్ చేయాలని మహేష్ (Mahesh) భావిస్తున్నాడు.

ఇప్పుడున్న దర్శకుల్లో ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేసే స్టార్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా.. అంటే అది అనిల్ రావిపూడి అనే చెప్పాలి. బాలకృష్ణతో అతను చేస్తున్న ‘భగవంత్ కేసరి’ తర్వాత మరో ప్రాజెక్టు కి కమిట్ అవ్వలేదు. కానీ మహేష్ కోసం అతను ‘సరిలేరు..’ టైంలోనే ఇంకో కథ రాసుకున్నాడు. దాన్ని డెవలప్ చేసి మహేష్ కి అతను వినిపించినట్టు సమాచారం. సో రాజమౌళి సినిమా మొదలయ్యేలోపు.. మరోసారి ‘సరిలేరు..’ కాంబోలో మూవీ చూసే అవకాశాలు మనకి ఉన్నాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus