టాలీవుడ్లో ఉన్న ప్రామిసింగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకడు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు వేసిన సత్యదేవ్ (Satya Dev) .. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో హీరోగా ఛాన్సులు దక్కించుకున్నాడు. అలా అని కేవలం హీరోగానే చేస్తాను అని అతను భీష్మించుకుని కూర్చోలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ తన రేంజ్ పెంచుకుంటున్నాడు. అయితే హీరోగా ఇతను మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు. వాటి బాక్సాఫీస్ రిజల్ట్..ఎలా ఉంటుంది అనేది తర్వాత.
కచ్చితంగా అతను హీరోగా చేస్తున్న సినిమాల్లో విషయం ఉంటుంది. అందుకే లాక్ డౌన్ టైంలో ఇతని నుండి వచ్చిన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma Maheswara Ugra Roopasya) వంటి సినిమాలు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల సత్యదేవ్ నుండి వచ్చిన సినిమా ‘కృష్ణమ్మ'(Krishnamma) . 2007 లో ఆయేషా అనే ఓ మైనర్ బాలిక హత్య ఉదంతం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో ‘అరుణాచల క్రియేషన్స్’ అధినేత కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని ఎంతో నిర్మించారు.
దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని రా అండ్ రస్టిక్ ఎంటర్టైనర్ గా మలిచాడు. మే 10 న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఓటీటీలో దీనికి మంచి ఆదరణ లభించింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఏకంగా 240దేశాల్లో ‘కృష్ణమ్మ’ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది నిజంగా ఓ అరుదైన రికార్డు అని చెప్పాలి. ఈ రకంగా సత్యదేవ్ ఓటీటీ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు అని చెప్పాలి.