‘టిక్కెట్ రేట్లు పెంచాలి.. టిక్కెట్ రేట్లు పెంచాలి… డిస్ట్రిబ్యూటర్లు చాలా ఘోరంగా నష్టపోతున్నారు’ అంటూ ‘భీమ్లా నాయక్’ టైంలో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణలో టికెట్ రేట్లతో ఇబ్బంది లేదు. కానీ ఆంధ్రాలో అయితే పరోక్షంగా పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు ఎక్కువ అమ్మినా.. అఫీషియల్ టికెట్ రేట్లకు తగ్గట్టే థియేటర్ యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్లకు కలెక్షన్లు చెల్లించినట్టు వాళ్ళు చెప్పి.. భారీ నష్టాల పాలైపోయినట్టు తెలియజేసారు.
చివరికి టికెట్ రేట్లు పెంచారు కానీ… ‘ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో వినోదం లేకుండా పోయింది’ అంటూ జనాలు కామెంట్లు మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో విడుదలైన పెద్ద సినిమాలు జనాలను థియేటర్లకు రప్పించడంలో విఫలమయ్యాయి. అందుకు కారణం టికెట్ రేట్లు భారీగా పెంచడం వల్లనే అని చాలా మంది భావిస్తున్నారు. దీంతో ఆంధ్రాలో మరోసారి టికెట్ రేట్లు తగ్గించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ‘అంటే సుందరానికి?’ చిత్రానికి టికెట్ రేట్లు మళ్ళీ భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుందట.
అది నాని పై కక్ష్య సాధింపు చర్య అనే డిస్కషన్లు కూడా ఇన్సైడ్ జరుగుతున్నాయి. టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నాని చేసిన కామెంట్లు అప్పట్లో చాలా హాట్ టాపిక్ అయ్యాయి. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లను ఏదో ఒక పేరు చెప్పి సీజ్ చేసింది జగన్ ప్రభుత్వం.
ఇప్పుడు నాని సినిమా ‘అంటే సుందరానికి?’ పై మరోసారి నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. ‘భీమ్లా నాయక్’ కు చేసినట్టు ‘అంటే సుందరానికి?’ చిత్రానికి టికెట్ రేట్లు తగ్గించి ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!