Mahesh Babu: రాజమౌళితో అన్నారు.. ఇప్పుడు త్రివిక్రమ్‌ అంటున్నారు.. అవుతుందా?

మహేష్‌బాబు సినిమాలో విక్రమ్‌. – ఈ మాట చాలా రోజుల క్రితం వినిపించింది. ఓ సినిమా కోసం విక్రమ్‌ను స్పందించారని, ఇంకా విక్రమ్‌ నుండి స్పందన రాలేదని అప్పుడు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మహేష్‌ సినిమా కోసం మళ్లీ విక్రమ్‌ పేరు వినిపిస్తోంది. అయితే అప్పుడు వినిపించిన దర్శకుడి పేరు, ఇప్పుడు వినిపిస్తున్న దర్శకుడు పేరు ఒకటి కాదు. దీంతో ‘పాత’ వార్తే మళ్లీ బయటకు వచ్చిందా, లేక ‘కొత్త’ వార్తనా అనేది తెలియడం లేదు. దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో తర్వాత చూద్దాం. ప్రస్తుతం ఆ వార్తేంటో చూద్దాం.

Click Here To Watch

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమా ముహూర్తం కూడా అయ్యింది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విక్రమ్‌ను సంప్రదించారని సమాచారం. త్రివిక్రమ్‌ సినిమాలో సీనియర్‌ హీరోలు కనిపించడం కొత్తేం కాదు. గత చిత్రాల్లో ఇలా కొందరు నటించారు. అయితే మహేష్‌తో చేసే సినిమాలో విలన్‌ పాత్ర బాగా వెర్సటైల్‌గా ఉంటుందని, దానికి విక్రమ్‌ అయితే బాగుంటారని త్రివిక్రమ్‌ అనుకుంటున్నారట. దీంతో ఆయనను సంప్రదించారని టాక్‌.

మరోవైపు మహేష్‌బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. చాలా కాలం క్రితమే దీనిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. అయితే సినిమా షూటింగ్‌ స్టార్ట్ అవ్వడమే ఆలస్యం. రాజమౌళి వరుస సినిమాలతో బిజీగా ఉండటం, మరోవైపు మహేష్‌ కూడా అలాగే ఉండటంతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే రాజమౌళి నెక్స్ట్‌ మహేష్‌తోనే అని పక్కా అయిపోయిన నేపథ్యంలో టీమ్‌ యాక్టర్స్‌ను ఎంపిక చేసే పనిలో ఉంది. అప్పుడే విక్రమ్‌ పేరు వినిపించింది.

రాజమౌళి సినిమా విషయంలో జరిగిన చర్చ బయటికొచ్చింది. ఇప్పుడు త్రివిక్రమ్‌ సినిమా చర్చలోనూ విక్రమ్‌ పేరు వినిపించింది. దీంతో ఏది నిజం… మహేష్‌ సినిమాలో విక్రమ్‌ నటిస్తారా? నటిస్తే ఏ దర్శకుడి సినిమాలో అనేది డౌట్‌గా మిగిలిపోయింది. ఏ సినిమాలో నటించినా విక్రమ్‌ అయితే తన నటనతో సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్తారు. సో సినిమా అభిమానిగా మనమైతే ఆ అద్భుతం కోసం వేచి చూద్దాం.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus