Allu Arjun: మెగా హీరో అంటే అలా ఉండాలి బన్నీ.. ట్రోలింగ్ షురూ!

మార్చ్ 27న రాంచరణ్ పుట్టినరోజు నాడు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పక్క భాషల స్టార్ హీరోలు కూడా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు వేశారు. కానీ అల్లు అర్జున్ చెప్పలేదు. రాంచరణ్ బర్త్ డే బ్యాష్ పార్టీలో కూడా అతను కనిపించలేదు. దీన్ని చరణ్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. నిజానికి బన్నీ.. చరణ్ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. డైరెక్ట్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని రూల్ ఏమీ లేదు. బహుశా ఫోన్ చేసి కూడా చెప్పుండొచ్చు.

అయినప్పటికీ మెగా హీరోలందరూ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు వేశారు కాబట్టి.. బన్నీ కూడా ఓ ట్వీట్ వేసేస్తే సరిపోయేది. కానీ అతను అలా చేయలేదు. పైగా చరణ్ అభిమానులకు మండేలా చేయాలని కూడా అనుకుంటాడనుకుంట. అయితే ఆ తర్వాతి రోజు అంటే మార్చ్ 28న అల్లు అర్జున్ హీరోగా పరిచయమై 20 ఏళ్లు పూర్తయింది. ‘దీంతో అల్లు అర్జున్ ఎదుగుదల చూసి గర్వపడుతున్నట్టు, భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు అందుకుని ఎంతో ఖ్యాతిని పొందాలని’ కోరుకుంటున్నట్టు చిరు ట్వీట్ చేశారు.

దీంతో బన్నీ అభిమానులు ఆనందపడ్డారు కానీ చిరు అభిమానులు, చరణ్ అభిమానులు, పవన్ అభిమానులు మాత్రం బన్నీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యుండొచ్చు. కానీ అతను మెగా హీరో అనే ప్రేక్షకులు ఆదరించారు అన్నది వాస్తవం. ఇప్పుడు అతను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మూలాలు మర్చిపోకూడదు. మొన్నటికి మొన్న ‘అల్లు ఫ్యామిలీకి.. మీకు కోల్డ్ వార్ నడుస్తుందా’ అంటూ ఓ ఇంటర్వ్యూలో యాంకర్ చిరంజీవిని ప్రశ్నిస్తే ‘ఈ ఇంటర్వ్యూ పూర్తయిన వెంటనే అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను..

మా మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. అల్లు అర్జున్ (Allu Arjun) స్టేజి పై నా పేరు చెప్పకపోయినా.. అది నాకు ఇబ్బంది కలిగించే విషయం ఏమీ కాదు, రేపు నా బిడ్డ చరణ్ అయినా సరే నా పేరు చెప్పుకోకుండా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను’ అంటూ చిరు హుందాగా జవాబిచ్చారు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయినా, 30 ఏళ్ళు అయినా ఇలాంటి హుందాతనం అనేది లేకపోతే.. బన్నీ ఎన్ని సాధించినా వెస్ట్ అని అంతా కామెంట్లు చేస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus