బాలీవుడ్ లో రణవీర్ సింగ్ లా, తెలుగులో విజయ్ దేవరకొండ. ఇద్దరి చేష్టలు, పనులు, డ్రెస్సింగ్ స్టైల్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. విజయ్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా తన బ్రాండ్ బట్టల స్టోర్ ను కూడా స్టార్ట్ చేసాడు అది వేరే విషయం అనుకోండి. అయితే.. నిన్న ఘనంగా జరిగిన దిల్ రాజు పుట్టినరోజు వేడుకలకు ఎప్పట్లానే తన స్టైల్ డ్రెస్సింగ్ లో దర్శనమిచ్చాడు విజయ్ దేవరకొండ.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ వంటి బడా హీరోలందరూ హాజరైన ఈ వేడుకకు విజయ్ సింపుల్ గా నైట్ డ్రెస్ వేసుకొచ్చేసాడు. లాంగ్ హేయిర్ తో చిన్నపిల్లాడిలా నైట్ డ్రెస్ వేసుకొచ్చిన విజయ్ ఎప్పట్లానే హైలైట్ అయ్యాడు. అదే విధంగా ట్రోలింగ్ కి కూడా గురయ్యాడు. విజయ్ టార్గెట్ కూడా అదే కాబట్టి., ట్రోలింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. అయితే.. ఈ నైట్ డ్రెస్ ను కూడా రౌడీ వేర్ అని అమ్మేస్తాడేమో చూడాలి.
ఇకపోతే.. విజయ్ త్వరలోనే “ఫైటర్” (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ సినిమా అనంతరం శివ నిర్వాణతో ఒక సినిమా, వివేక్ ఆత్రేయతో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు విజయ్. ముఖ్యంగా “డియర్ కామ్రేడ్” డిజాస్టర్ అనంతరం విజయ్ కి అర్జెంట్ గా హిట్ అనేది చాలా అవసరం. మరి పూరి దర్శకత్వంలో విజయ్ హిట్ కొడతాడా లేదా చూడాలి.