‘హ్యాపీ డేస్’ సినిమాతో టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మిక్కీ జే మేయర్. ఆ తరువాత కొన్ని హిట్టు సినిమాలకు పని చేశారు. ‘మహానటి’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంలో మిక్కీ మ్యూజిక్ కీలకపాత్ర పోషించింది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మిక్కీ.. ఇప్పటివరకు మాస్ టచ్ ఉన్న మ్యూజిక్ ఇవ్వలేకపోయారు.
ఆయన కేవలం క్లాస్ సినిమాలకు మాత్రమే వర్క్ చేయగలరనే ముద్ర పడిపోయింది. మిక్కీ జే మేయర్ కెరీర్ లో ఆయన సంగీతం అందించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. అయినప్పటికీ మాస్ మ్యూజిక్ ఇవ్వలేరనే ముద్ర కారణంగా ఒక స్థాయికి మించి ఆయన ఎదగలేకపోయారు. చివరిగా ఆయన నుంచి వచ్చిన సినిమాలు పెద్ద విజయాలు సాధించినా.. మిక్కీ చేతిలో సినిమాలు లేకపోవడం బాధాకరం.మిక్కీ చివరి సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ అతడికి మంచి పేరే తీసుకొచ్చింది.
అయినప్పటికీ మిక్కీ కెరీర్ ఊపందుకోలేదు. ‘ప్రాజెక్ట్ K’ రూపంలో అతడికి పెద్ద ఛాన్స్ వచ్చింది. ‘మహానటి’ సినిమాకి గొప్ప మ్యూజిక్ ఇచ్చారని దర్శకుడు నాగశ్విన్ తన నెక్స్ట్ సినిమాకి కూడా మిక్కీనే తీసుకోవాలనుకున్నారు. కానీ ‘ప్రాజెక్ట్ K’ లాంటి పాన్ ఇండియా సినిమాకి మిక్కీ ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వగలరా..? అనే సందేహాలు కలిగాయి. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. కానీ నాగశ్విన్ మాత్రం ఎలాంటి అనుమానాలు పెట్టుకోలేదు.
కానీ మధ్యలో ఏమైందో ఏమో ఇప్పుడు మిక్కీని తప్పించి సంతోష్ నారాయణన్ ను తీసుకున్నారు. ఇది మిక్కీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ‘ప్రాజెక్ట్ K’తో తన కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని భావించారు మిక్కీ. కానీ ఇప్పుడు ఆ ఆఫర్ చేజారింది. ప్రస్తుతం అతడి చేతిలో ‘రామబాణం’ అనే సినిమా మాత్రమే ఉంది. ఇది పక్కా మాస్ ఫిలిం. ఈ సినిమాతో మిక్కీ మెప్పిస్తే.. అతడికి అవకాశాలు రావడం గ్యారెంటీ.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?