బిగ్ బాస్ 4: ఒక్క గేమ్ తో గ్రాఫ్ పెరిగిపోయింది..!

బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం నామినేషన్స్ లో ఐదుగురు ఉన్నారు. అయితే, రేస్ టు ఫినాలేలో భాగంగా జరిగిన టాస్క్ లో ఒక్కొక్కరి ఓటింగ్ గ్రాఫ్ అనేది పూర్తిగా మారిపోతోంది. ఒకరోజు ఉన్న లెక్కలు వేరే రోజు ఉండటం లేదు. దీంతో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠ సోషల్ మీడియాని ఊపేస్తోంది.

రోజుకో పోలింగ్ సైట్స్ లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయి. నిన్నటిదాకా అభిజిత్ అఖిల్ టాప్ టు ప్లేస్ లలో ఉంటే, ఇప్పుడు అభిజిత్ అండ్ హారికలు ఫస్ట్ సెకండ్ ప్లేస్ లని కైవసం చేసుకున్నారు. దీనికి రేస్ టు ఫినాలే టాస్క్ కారణంగా మారుతోంది. సోహైల్ తో కలిసి టీమ్ వర్క్ లాగా ఆడిన అఖిల్ రేస్ టు ఫినాలే టిక్కెట్ ని దక్కుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో హారిక – అరియానా, అవినాష్ , అభిజిత్ లా గ్రాఫ్ పూర్తిగా మారిపోతోంది. అరియానా నామినేషన్స్ లో లేదు కాబట్టి, అవినాష్ ని ఇప్పుడు సేఫ్ చేసేందుకు అందరూ రెడీ అవుతున్నారు. అంతేకాదు అభిజిత్ , హారిక తో పాటుగా అవినాష్ ని కూడా టాప్ కి తీస్కుని రావాలని ట్రై చేస్తున్నారు.

అప్పుడు అఖిల్ ఇంకా మోనాల్ ఇద్దరూ డేంజర్ జోన్ లో పడతారు. ఒకవేళ ఇదే గనక జరిగితే మోనాల్ ఈసారి ఎలిమినేట్ అయిపోతుందా అని కూడా అంటున్నారు. మరి చూద్దాం ఈసారి హౌస్ నుంచి ఎవరు వెళ్లిపోతారు అనేది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus