Jr NTR: తారక్ ఖాతాలో ప్రముఖ బ్రాండ్స్.. క్రేజ్ రెట్టింపవుతోందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు తారక్ కు క్రేజ్ పెరుగుతుండగా తారక్ ఖాతాలో ప్రముఖ బ్రాండ్స్ చేరుతున్నాయి. ఇంటర్నేషనల్, నేషనల్ బ్రాండ్స్ కు తారక్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. కొన్నిరోజుల క్రితం మెక్ డొనాల్డ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఓకే చెప్పిన తారక్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ యాడ్ కు సంబంధించిన షూట్ జరుగుతోందని సమాచారం అందుతోంది. యాడ్ షూట్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు తెగ సంతోషిస్తుండటం గమనార్హం. తారక్ ఖాతాలో ప్రముఖ బ్రాండ్స్ చేరుతుండటంతో తారక్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. తారక్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని ఆ సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో కళ్లు చెదిరే విజువల్స్ తో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది. కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడంతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో సైతం తారక్ నటిస్తున్నారు. యాడ్స్ కోసం కూడా తారక్ భారీ స్థాయిలో అందుకుంటున్నారు.

తారక్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బ్రాండ్స్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కుతుండటం దక్కుతోంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాండ్స్ తో తారక్ క్రేజ్ ను మరింత పెంచుకుంటారేమో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో కూడా క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus