Pooja Hegde: కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆహ్వానం అందుకున్న పూజాహెగ్డే!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న పూజా హెగ్డే కెరీయర్ ప్రస్తుతం డైలమాలో పడింది. ఈమె నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈమె కెరియర్ ఇబ్బందులలో పడిందనే చెప్పాలి. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్,బీస్ట్, ఆచార్య సినిమాలు ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే పూజాహెగ్డేను ఐరన్ లెగ్ అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా పూజా హెగ్డే వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతూ ఉండగా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పూజా హెగ్డే, రెండు హిందీ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ సినిమాలు కనుక హిట్ అయితేనే ఈమె కెరీర్ ముందుకు సాగుతుంది లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనలో ఉన్న సమయంలో ఈమెకు కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ నుంచి ఆహ్వానం అందడంతో పూజా హెగ్డే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మే 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్యారిస్ లో జరగనున్న 75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో పూజా హెగ్డే పాల్గొననున్నారు.

ఈ ఫిలిమ్ ఫెస్టివల్ లో భాగంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కంగనా వంటి సినీ తారలు పాల్గొని సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి పూజా హెగ్డేకు ఈ ఫిలిమ్ ఫెస్టివల్ లో పాల్గొనే అవకాశం రావడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే పూజా హెగ్డే కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో పాల్గొనడం కోసం ఈనెల 16వ తేదీ ప్యారిస్ వెళ్లనున్నారు.

17, 18 వ తేదీలలో పూజా హెగ్డే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసిన అనంతరం స్టార్ సెలబ్రిటీలతో కలిసి విందు చేయనున్నారు.ఈ విధంగా పూజ హెగ్డేకు వరుస ప్లాప్ చిత్రాలు వస్తున్నప్పటికీ ఈమెకు ఈ విధమైనటువంటి అరుదైన అవకాశం రావడంతో బుట్ట బొమ్మ ఆనందానికి అవధులు లేవు అని చెప్పాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus