ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న కీలక సమావేశాలకు బాలకృష్ణను ఆహ్వానించక పోవడంతో నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కొందరు బాలయ్య ఇలా బహిరంగ విమర్శలు చేసి ఉండకూడదు అని కొందరు అంటుంటే, బాలయ్య లాంటి సీనియర్ హీరోని ఆహ్వానించక పోవడం తప్పని కొందరు చిరు వర్గాన్ని తప్పు బడుతున్నారు. ఏది ఏమైనా ఇది పరిశ్రమలో నిప్పు రాజేసింది. ఈ నేపథ్యంలో నేడు చిరు అధ్యక్షతన ఆయన ఇంటిలో మరో మీటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ కరోనా క్రైసిస్ ఛారిటీ సభ్యుల మధ్య జరిగినట్లు సమాచారం.
కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమపై ఆధారపడిన చాలా మంది కార్మికుల సహాయార్ధం కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో ఓ నిధిని ఏర్పాటు చేసి, చిత్ర ప్రముఖుల నుండి విరాళాలు సేకరించారు. ఈ సంస్థ తరుపున ఇప్పటికే చాలా మందికి విడతల వారీగా నిత్యావసరాల పంపిణీ చేస్తున్నారు. నేడు చిరు నివాసంలో జరిగిన మీటింగ్ దీని గురించే అని తెలుస్తుంది. సీసీసీ సభ్యులు ఇంకా సహాయం అందని కార్మికుల కూడా సహాయం చేసే విషయాలను చర్చించినట్లు సమాచారం.
ఈ మీటింగ్ లో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ బాలకృష్ణ వ్యాఖలపై స్పందించారు. బాలయ్య అవసరం ఉంటే ఖచ్చితంగా ఆయన్ని కూడా పిలుస్తాం. ఈ విషయాన్ని పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు.