Balakrishna: ఆ ఆస్పత్రిని నంబర్2 స్థానంలో నిలిపిన బాలయ్య.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. బాలయ్య పుట్టినరోజు కానుకగా బాలయ్య అనిల్ కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్ తో పాటు బాలయ్య కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్ కూడా రానుందని తెలుస్తోంది. సినిమాల విషయంలో బాలయ్య వేగం పెంచడంతో పాటు ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం ఫ్యాన్స్ సంతోషానికి కారణమైంది.

త్వరలో బాలయ్య (Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్3 కూడా మొదలుకానుందని టాలీవుడ్ సినీ ప్రముఖులలో చాలామంది ఈ షోకు హాజరు కానున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే బాలయ్య తాజాగా మరో రేర్ రికార్డ్ ను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. బాలయ్య సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా బసవతారకం ఆస్పత్రి వ్యవహారాలను ఆయనే స్వయంగా చూసుకుంటున్నారు.

బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ చికిత్సలో రెండో స్థానంలో నిలవడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఆస్పత్రికి బాలయ్య ఛైర్మన్ గా ఉండగా ఔట్ లుక్ నిర్వహించిన సర్వేలో ఈ ఆస్పత్రి రెండో స్థానంలో నిలిచింది. ఈ ఆస్పత్రి ద్వారా బాలయ్య తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు వైద్యం అందేలా చేస్తున్నారు. ఈ ఆస్పత్రి సౌకర్యాల విషయంలో నెటిజన్ల నుంచి సైతం ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఇతర ఆస్పత్రులలో పోల్చి చూస్తే బసవతారకం ఆస్పత్రిలో ఛార్జీలు తక్కువ కాగా పనితీరు విషయంలో మాత్రం ఈ ఆస్పత్రి ముందువరసలో ఉంటుంది. అక్కడ వైద్యం తీసుకున్న పేద ప్రజలు బాలయ్య మంచితనం, గొప్పదనం గురించి ప్రశంసిస్తున్నారు. బాలయ్య బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఆ కార్యక్రమాల గురించి చెప్పుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. బాలయ్య కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలో మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus