ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో వరుసగా రేర్ రికార్డులు చేరుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల షూటింగ్ లు మొదలుకాకపోయినా అరుదైన రికార్డుల ద్వారా తారక్ వార్తల్లో నిలుస్తున్నారు. గ్రాండ్ గా ఆస్కార్ అవార్డుల వేడుక జరగగా ప్రపంచవ్యాప్తంగా 18.7 మిలియన్ల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారని సమాచారం. 2021 సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ ఏడాది వీక్షకుల సంఖ్య 12 శాతం పెరిగింది.
ఆయితే ఆస్కార్ అవార్డ్ వేడుకలో సోషల్ మీడియాలో, న్యూస్ లో ఎక్కువగా ప్రస్తావించిన నటుల జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. సోషల్ మీడియాను విశ్లేషించే నెట్ బేస్ క్విడ్ ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ తొలి స్థానంలో నిలిస్తే చరణ్ రెండో స్థానంలో నిలిచారు. అవార్డులు దక్కించుకున్న ఇతర నటీనటులు ఈ జాబితాలో తర్వాత స్థానాల్లో నిలిచారు. అదే సమయంలో ఎక్కువమంది ప్రస్తావించిన మూవీగా ఆర్.ఆర్.ఆర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఈ సినిమా తర్వాత ది ఎలిఫెంట్ విస్పరర్స్ పేరు ఉండటం గమనార్హం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరడంతో తారక్ టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. తారక్ తర్వాత సినిమాలతో కూడా ఆస్కార్ అవార్డులను అందుకునే స్థాయికి ఎదగాలని కథా బలం ఉన్న సినిమాలకు ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లేదా బాలయ్య, ఎన్టీఆర్ కాంబినేషన్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఎన్టీఆర్30 టైటిల్ ను ప్రకటించడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. మే నెల 20వ తేదీన ఈ సినిమా టైటిల్ ను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.