మెగాస్టార్ చిరంజీవి హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్లకు చిరంజీవి అవకాశాలు ఇవ్వడంతో పాటు సినిమాల సక్సెస్ కోసం చిరంజీవి ఎంతగానో కష్టపడ్డారు. వాల్తేరు వీరయ్య మూవీ ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం. వాల్తేరు వీరయ్య మూవీకి ఆరు రోజుల్లోనే 157 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు కూడా 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఏకంగా మూడు సినిమాలు 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో చిరంజీవి ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది. చిరంజీవి సాధిస్తున్న రికార్డులు ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నటుడిగా చిరంజీవి స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. భోళా శంకర్ సినిమాలో కూడా మాస్ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
చిరంజీవి తమన్నా కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో చిరంజీవి లుక్ కూడా కొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది. చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. చిరంజీవి రీఎంట్రీలో కూడా వరుస విజయాలతో సత్తా చాటుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. చిరంజీవి కమర్షియల్ సినిమాలలో నటిస్తూనే ఆ సినిమాలతో విజయాలను అందుకుంటున్నారు.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు ఆంధ్ర, సీడెడ్ బయ్యర్లకు అంచనాలకు మించి లాభాలను అందించాయి. చిరంజీవి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో స్పష్టత రానుంది.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?