RRR Movie: హాలీవుడ్ లో ఆ గుర్తింపు దక్కిన మూవీ ఆర్ఆర్ఆర్ మాత్రమే!

భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో 1140 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా సాధించిన సక్సెస్ వల్ల అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు చరణ్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ తో పాటు జీ5 ఓటీటీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా గతంలో ఏ సినిమా అందించని స్థాయిలో ఈ సినిమా అటు జీ5 కు ఇటు నెట్ ఫ్లిక్స్ కు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించిందని సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ హాలీవుడ్ బడా సినిమాల సరసన చేరింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి టాప్ 10 బెస్ట్ సినిమాల జాబితాలో ఈ సినిమాకు కూడా స్థానం దక్కింది.

ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ కాగా ఇతర సినిమాలన్నీ హాలీవుడ్ సినిమాలు కావడం గమనార్హం. ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ నామినేట్ కావడం గురించి ఆర్ఆర్ఆర్ యూనిట్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ కూడా ఈ అరుదైన ఘనత విషయంలో ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమాను ఏప్రిల్ ఎండింగ్ లేదా మే తొలి వారంలో రిలీజ్ చేసి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న మహేష్ తో సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పటినుంచి మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus