Jr NTR: ఎన్టీఆర్ మూవీ ఆగష్టులో కూడా మొదలు కాదా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు సినిమాసినిమాకు మార్కెట్ కు పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. వరుసగా ఆరు విజయాలతో తారక్ డబుల్ హ్యాట్రిక్ సాధించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే అదే సమయంలో తారక్ వేగంగా సినిమాలలో నటించడం లేదని ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. తారక్ కొరటాల కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యం కావడం అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.

జూన్ నెలలోనే తారక్ కొరటాల కాంబో మూవీ షూట్ మొదలు కావాల్సి ఉండగా ఆగష్టుకు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పదే పదే వాయిదా పడుతుండటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఆచార్య మూవీ వల్లే ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

ఆచార్య నష్టాల భర్తీకి సంబంధించిన సమస్యలు కొరటాల శివను వెంటాడుతున్నాయని ఈ సినిమా బిజినెస్ లో పాలు పంచుకోవడం కొరటాల కెరీర్ పై ప్రభావం చూపుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి వేర్వేరు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ను ఇప్పటివరకు ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.

త్వరలో అధికారికంగా ఈ సినిమాలో నటించే నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. కొరటాల శివ ఈ సినిమాతో తప్పనిసరిగా సక్సెస్ సాధించాల్సి ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే కొరటాల శివకు దర్శకునిగా కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus