ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీకి సంబంధించి ఓవర్సీస్ లో, ఇతర రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. సలార్ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమాలో మొత్తం ఫైట్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఫస్టాఫ్ లో రెండు ఫైట్ సీన్లు ఉన్నాయని సెకండాఫ్ లో మూడు ఫైట్ సీన్లు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సలార్ ప్రీ రిలీజ్ టాక్ వేరే లెవెల్ లో ఉంది.
సినిమాకు ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో జరగకపోయినా సినిమా నిరాశ పరిచే ఛాన్స్ లేదని సమాచారం. రఫ్ కాపీ చూసిన వాళ్లు సినిమా అద్భుతంగా వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఎంట్రీ కొంతమేర ఆలస్యం అయినా ఆ లోటు లేకుండానే సినిమా స్టార్టింగ్ సీన్లు బాగా వచ్చాయని తెలుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు విందు భోజనంలా ఈ సినిమా ఉండనుంది. ప్రభాస్ సలార్ అంచనాలను మించి మెప్పించడం ఖాయమని సమాచారం అందుతోంది.
ఫస్టాఫ్ నిడివి తక్కువని సెకండాఫ్ నిడివి ఎక్కువని సమాచారం. సలార్ మూవీ లాంగ్ రన్ ఉంటుందని నిర్మాతలు సైతం ఫిక్స్ అయ్యారని సమాచారం. సలార్ మూవీ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండనుందని తెలుస్తోంది. సలార్ గురించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ప్రభాస్ మూవీకి మరీ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు. కంటెంట్ మీద మేకర్స్ కు ఊహించని స్థాయిలో నమ్మకం ఉండగా ఆ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి.
అన్ని వర్గాల ఫ్యాన్స్ ను మెప్పించే విధంగా ఈ సినిమా (Salaar) ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. కేజీఎఫ్ సినిమాను మించి ఈ సినిమా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.