తమిళులకు భాష మీద మక్కువ ఎక్కువ. వాళ్ల సినిమాలకు ఎక్కువగా తమిళంలోనే పేర్లు పెడతారు అనేవారు. అయితే ఇటీవల అక్కడ పరిస్థితి మారింది. వాళ్ల సినిమాలకు ఇంగ్లిష్ పేర్లు పెడుతున్నారు. అంతేకాదు ఆ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చినప్పుడు పేరుని తెలుగులోకి మార్చడం లేదు. అవును ఇటీవల కాలంలో ఈ పరిస్థితి ఎక్కువైంది. ఓ ‘వలిమై’, ఓ ‘మహాన్’, ఓ ‘ఈటి’… ఇలా వచ్చినవే. ఇంకా ఈ వరుసలో ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి అని సమాచారం.
ప్రతి తమిళ పదానికి ఓ తెలుగు పదం ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే పైన చెప్పుకున్న ‘వలిమై’, ‘మహాన్’, ‘ఈటి’ సినిమా పేర్లకు తెలుగు పదాలు ఉన్నాయి. వలిమై అంటే బలం. మహాన్ అంటే మహానుభావుడు, ఈటి అంటే తమిళ పూర్తి పేరు ‘ఎదర్కుం తునిందవన్’ అంటే ‘దేనికీ భయపడనివాడు’ అని అర్థం. కానీ తెలుగులో ఆ సినిమాలకు ఈ పేర్లు ఏవీ పెట్టలేదు. ఇవి కొత్త సినిమాలు కాబట్టే వీటి గురించి మాట్లాడుతున్నాం. గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి.
తమిళంలో సినిమాకు ఇంగ్లిష్ పేరు పెడితే… ఈ తెలుగు పేరు సమస్య ఉండదు. ఆ తరహా సినిమాలకు ‘బీస్ట్’, ‘మాస్టర్’, ‘24’ లాంటివి ఉదాహరణగా తీసుకోవచ్చు. కానీ తెలుగు పేరు ఉండి, ఎందుకో తెలుగు వాడటం లేదు. దీని గురించి కార్తికేయ మాట్లాడుతూ ‘తమిళంలో ఉన్న పేరు తెలుగు వాళ్లకు అలవాటు అయిపోయిందని, ఇప్పుడు వేరే పేరు పెడితే డబ్బింగ్ అనుకుంటారని అలా చేశాం’ అని ‘వలిమై’ గురించి చెప్పాడు. ఆ సినిమాలో కార్తికేయ విలన్‌గా కనిపిస్తున్న విషయం తెలిసిందే.
‘మానాడు’ సినిమాను తెలుగులోకి తీసుకొద్దాం అనుకున్నప్పుడు దానికి ‘లూప్’ అనే పేరు పెట్టారు. వాళ్లు కూడా ‘మానాడు’ అని రిలీజ్ చేయొచ్చు కానీ చేయలేదు. అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకోండి. ఇలా పేరు మార్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇది రీసెంట్ కాబట్టి చెప్పాం. ఇదంతా చూస్తుంటే మేం పేరు మార్చం… మీరే అడ్జస్ట్ అవ్వండి అనుకుంటున్నారేమో అనిపిస్తోంది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!