Allari Naresh: అల్లరి నరేష్ కు మాత్రమే సొంతమైన ఆ అరుదైన రికార్డు ఏంటో తెలుసా?

ఎంత చిన్న హీరో సినిమా అయినా షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి కనీసం 30 నుండి 50 రోజులు టైం పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది. ఒకప్పుడు అయితే నెల రోజుల్లో సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి.. విడుదల చేసేయడం కూడా జరిగేది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ గురించి అందరికీ అవగాహన వచ్చింది. చాలా రిసోర్స్ లు అందుబాటులో ఉన్నాయి.

అయినా సరే ఒక్కో సినిమా కంప్లీట్ చేయడానికి 6 నెలలు, ఏడాది టైం పట్టేస్తుంది. దీనికి ప్రధాన కారణం.. ‘నటీనటుల సహకారం లేకపోవడమే అని దాసరి, తేజ వంటి స్టార్ డైరెక్టర్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాలను అలా ఉంచితే హీరో అల్లరి నరేష్ ఒక్కరోజులోనే సినిమాలోని పాటల షూటింగ్ ను ఫినిష్ చేశాడట. ఆ సినిమా మరేదో కాదు ‘అల్లరి’. రవిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ ఒక్కరోజులో పూర్తయిపోయిందట.

ఈ విషయాన్ని దర్శకుడు రవిబాబు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. మొదటి సినిమాకే (Allari Naresh) నరేష్ అంత డెడికేషన్ చూపించాడని, అతను తన తండ్రి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతో అటు డైరెక్షన్ ని, ఇటు నిర్మాతల ఆలోచనల్ని అర్ధం చేసుకున్నాడని రవిబాబు చెప్పుకొచ్చాడు. 2002 లో వచ్చిన ‘అల్లరి’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. నరేష్ పేరుకి ముందు అల్లరి అనే ట్యాగ్ ను చేర్చేలా చేసింది. ఇక అల్లరి నరేష్ నటించిన ‘ఉగ్రం’ సినిమా మే 5 న విడుదల కాబోతోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus