Balakrishna: ఈ జనరేషన్ లో బాలయ్య మాత్రమే అలా చేస్తారా?

  • November 19, 2022 / 05:39 PM IST

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరోలు కెరియర్ మొదట్లో సినిమా అవకాశాలు అందుకొని సినిమాలు చేస్తున్నప్పటికీ అనంతరం వారు కూడా మెగా ఫోన్ పట్టుకోవాలని ఆలోచనలో ఉంటారు. ఇలా పలువురు హీరోలు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు దర్శకులుగా వ్యవహరిస్తూ ఉంటారు.అయితే స్టార్ హీరోలు ఇలా వారి దర్శకత్వంలోనే సినిమాలలో నటించడం అంటే ఎంతో కష్టతరంతో కూడుకున్న విషయం అని చెప్పాలి. ఇలా ఎంతో కష్టతరమైన పనులను కొందరు హీరోలు చేసి నిరూపించారు.

అప్పట్లో దివంగత నందమూరి తారక రామారావు దానవీరసూరకర్ణ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టడమే కాకుండా దర్శకత్వం కూడా వహించి కేవలం నేలన్నర వ్యవధిలోని ఈ సినిమాను విడుదల చేశారు. ఇకపోతే నటశేఖరుడు కృష్ణ సైతం ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక చిరంజీవి బాలకృష్ణ వారి విషయానికి వస్తే ఈ జనరేషన్ హీరోలు ఇప్పటివరకు ఎలాంటి సినిమాలకు దర్శకత్వం వహించలేదు.ఇకపోతే తాజాగా బాలకృష్ణ మెగా ఫోన్ పట్టబోతున్నారని వెల్లడించారు.

బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఎన్నో రికార్డులను సృష్టించింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయం పై బాలకృష్ణ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. విశ్వక్ హీరోగా నటిస్తున్న దమ్కీసినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి బాలకృష్ణ ఆదిత్య 369 సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాకు తప్పకుండా సీక్వెల్ ఉంటుందని, ఈ సీక్వెల్ చిత్రం ఆదిత్య 999 టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయని వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమవుతుందని, తన డైరెక్షన్లో ఆదిత్య 999 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని బాలకృష్ణ వెల్లడించారు. ఇలా బాలకృష్ణ ఈ సినిమా గురించి చెప్పడంతో ఈ జనరేషన్లో దర్శకుడుగా మారిన ఏకైక హీరోగా బాలకృష్ణ రికార్డు సొంతం చేసుకున్నారని చెప్పాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus