నవంబర్ ఫస్ట్ హాఫ్ లో హిట్టు కొట్టిన ఏకైన సినిమా అదే..!

నవంబర్ అనేది టాలీవుడ్ కు డ్రై సీజన్ అంటారు ట్రేడ్ పండితులు. నవంబర్ మాత్రమే కాదు ఫిబ్రవరి నెల కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ కు పెద్దగా కలిసిరాదు అని అంతా అంటుంటారు. అలా అని ఈ నెలల్లో విడుదలైన సినిమాలు హిట్ అవ్వవా అంటే అలాంటిదేమి లేదు. హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.ఎక్కువ శాతం సినిమాలు విజయం సాధించిన సందర్భాలు ఉండవు. ఇది నిజమే అని ఈ నవంబర్ నెల మరోసారి నిరూపించింది.

ఈ నెలలో ఇప్పటికే 25 సినిమాల వరకు విడుదలయ్యాయి. అందులో క్రేజ్ ఉన్న సినిమాలు ‘పెద్దన్న’ ‘మంచిరోజులు వచ్చాయి’ ‘ఎనిమి’ ‘రాజా విక్రమార్క’ ‘పుష్పక విమానం’ ‘కురుప్’ వంటివి మాత్రమే. అయితే వీటిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన మూవీ ఒక్క ‘కురుప్’ మాత్రమే.అది కూడా డబ్బింగ్ సినిమా అన్న సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో రూ.80 లక్షలకి అమ్మారు. 4 రోజులకే ఈ చిత్రం రూ.1.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.

పోటీగా ‘రాజా విక్రమార్క’ ‘పుష్పక విమానం’ వంటి రెండు తెలుగు సినిమాలు ఉన్నప్పటికీ వాటిని మించి కలెక్ట్ చేసింది ‘కురుప్’ చిత్రం. మొత్తానికి నవంబర్ ఫస్ట్ హాఫ్ లో హిట్టు కొట్టిన సినిమాగా ‘కురుప్’ నిలిచింది.మరి నవంబర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే ‘లక్ష్య’ ‘గుడ్ లక్ సఖి’ వంటి చిత్రాలు ఎలా రాబడతాయో చూడాలి..!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus