సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్..లు హీరోయిన్లుగా ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమా రూపొందింది. వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ లభించింది.శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘నిజమే నే చెబుతున్నా’ అనే పాట చార్ట్ బస్టర్ అవ్వడమే కాకుండా ఈ సినిమా పై అంచనాలు పెరగడానికి కూడా కారణమైంది. గతంలో సందీప్ కిషన్ – విఐ ఆనంద్ కాంబినేషన్లో ‘టైగర్’ అనే మూవీ వచ్చింది.
అది డీసెంట్ సక్సెస్ అందుకుంది. అందుకే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా ఈ వారం ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది అని చెప్పాలి. చిత్ర బృందం అయితే ఈ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఆల్రెడీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలకి ఈ సినిమా స్పెషల్ షోలు వేయడం జరిగింది. సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా జరిగింది.
వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ సిల్లీ కామెడీతో కొంత మిస్టరీతో సాగుతుందట. సంగీతం.. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆహ్లాదకరంగా ఉంటుందని అంటున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్దకు వచ్చేసరికి హీరోయిన్ దెయ్యం అనే ట్విస్ట్ ఇస్తాడట దర్శకుడు. దీంతో సెకండాఫ్ పై ఇంకా ఆసక్తి పెరుగుతుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉన్నా.. ప్రిడిక్టబుల్ గా ఉంటుందని అంటున్నారు. క్లైమాక్స్ కి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట.
సందీప్ కిషన్ నటన బాగున్నప్పటికీ.. వర్ష బొల్లమ్మ నటనకి ఎక్కువ మార్కులు పడతాయని అంటున్నారు. కావ్య థాపర్.. పాత్ర గురించి ఎక్కువ చెబితే స్పాయిలర్ అవుతుందట. డైరెక్షన్ , స్క్రీన్ ప్లే ఓకే అనిపిస్తాయని… సో చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ కి ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) మంచి విజయాన్ని అందించడం ఖాయమని అంటున్నారు.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!