Operation Valentine OTT: ఆపరేషన్ వాలంటైన్ డిజిటల్ రైట్స్ ఆ ఓటీటీ సొంతమయ్యయా?

  • March 2, 2024 / 09:17 AM IST

ఈరోజు థియేటర్లలో విడుదలైన ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేనని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆపరేషన్ వాలంటైన్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందని తెలుస్తోంది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ నాలుగు వారాల తర్వాత ఓటీటీలో సినిమాలను స్ట్రీమింగ్ చేస్తుంది. అయితే ఆపరేషన్ వాలంటైన్ నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో లేక మరింత ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలియాల్సి ఉంది.

హిందీ వెర్షన్ కు సంబంధించి మల్టీప్లెక్స్ రూల్స్ వల్ల ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి. ఏ సెంటర్స్ లో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆపరేషన్ వాలంటైన్ సక్సెస్ తో వరుణ్ తేజ్ తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి.

వరుణ్ తేజ్ బడ్జెట్ కు అనుగుణంగా పారితోషికం తీసుకుంటానని చాలా సందర్భాల్లో వెల్లడించారు. వరుణ్ తేజ్ తర్వాత మూవీ మట్కా టైటిల్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. కరుణ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సోలో హీరోగా వరుణ్ తేజ్ మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేశభక్తి ప్రధానంగా సాగే సీన్స్, వరుణ్ తేజ్ మానుషి చిల్లర్ యాక్టింగ్, విజువల్స్ ఆపరేషన్ వాలంటైన్ కు హైలెట్ గా నిలిచాయి.

ప్రయోగాత్మక కథలకు వరుణ్ తేజ్ ఎక్కువగా ఓటేస్తున్నారు. వరుణ్ సినిమా సినిమాకు నటుడిగా అంతకంతకూ ఎదుగుతున్నారు. ఆపరేషన్ వాలంటైన్ (Operation Valentine) సినిమాలో ఫైటర్ జెట్ల వీరవిహారంతో కూడిన విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాయి.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus