ప్రముఖ సర్వే సంస్థలలో ఒకటైన ఆర్మాక్స్ మీడియా ప్రతి నెలా రిలీజ్ చేసే సర్వే ఫలితాలు ప్రేక్షకులకు సైతం ఒకింత ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఆర్మాక్స్ అక్టోబర్ సర్వే ఫలితాలు తాజాగా రిలీజ్ కాగా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాలో మరోసారి ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. గతంలో పలు సందర్భాల్లో ఈ స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ ఈసారి కూడా నంబర్ వన్ గా నిలవడం గమనార్హం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఈ లిస్ట్ లో రెండో స్థానం దక్కింది. ప్రభాస్ ప్రస్తుతం సలార్ తో బిజీగా ఉండగా తారక్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. బన్నీ, చరణ్, మహేష్, పవన్ కళ్యాణ్ 3, 4, 5, 6 స్థానాలను సొంతం చేసుకున్నారు. నాని, విజయ్ దేవరకొండ 7, 8 స్థానాలలో నిలవగా చిరంజీవి, రవితేజ 9, 10 స్థానాలలో నిలిచారు. ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో నిలవడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రభాస్ కు పాన్ ఇండియా స్థాయిలో అంచనాలకు మించి క్రేజ్ ఉండటం వల్లే నంబర్ వన్ స్థానం సొంతమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ నెల 1వ తేదీన రాత్రి 7.19 నిమిషాలకు సలార్ ట్రైలర్ రిలీజ్ కానుండగా టీజర్ తో యూట్యూబ్ ను షేక్ చేసిన ప్రభాస్ ట్రైలర్ తో కూడా మరోమారు షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సలార్1, సలార్2 భారతీయ సినీ చరిత్రలోనే కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేసే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ మార్కెట్ రేంజ్ ను మరోమారు ప్రూవ్ చేసే మూవీ సలార్ అవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సలార్1 సక్సెస్ సాధిస్తే ప్రభాస్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.