ఓటీటీల గురించి మీకు అంతా తెలుసా? సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తే అన్ని రోజుల పాటు ఆ ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు లాంటి కంటెంట్‌ను వీక్షించొచ్చు. ఇది అందరికీ తెలిసిందే. అయితే దీనికి ఇటీవల ఓటీటీలు కొత్త లంకెను తీసుకొచ్చాయి. అదే పే పర్ వ్యూ. అంటే సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తూనే.. సినిమాకు మరో వందో, నూట యాభయ్యో చెల్లించాలి. అప్పుడే సినిమా చూడొచ్చు. అది కూడా డబ్బులు చెల్లించిన రెండు రోజుల్లో చూసేయాలి. లేకపోతే మళ్లీ డబ్బులు కట్టాలి.
చాలావరకు కొత్త సినిమాలకే ఈ లంకె పెట్టిన ఓటీటీలు… ఇప్పుడు పాత సినిమాల విషయంలో తమ తెలివి చూపిస్తున్నాయి. మీకు గుర్తుండే ఉంటుంది. మొన్నీ మధ్య ‘కేజీయఫ్ 2’, ‘ఆర్‌ఆర్ఆర్’ ఓటీటీలకు వస్తున్నప్పుడు ఒకటే చర్చ జరిగింది. సినిమాలను ఓటీటీల్లో చూడాలంటే మళ్లీ డబ్బులు కట్టమంటారు అని. దీంతో ఒక్కసారిగా సినిమా ప్రేక్షకుల్లో అసహనం పెరిగిపోయింది. ఓటీటీలకు మళ్లీ డబ్బులేంటి అని ప్రశ్నించారు. నెటిజన్లు అయితే తమకు తెలిసిన విధంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు.
దీంతో ‘ఆర్ఆర్‌ఆర్’ టీమ్ కాస్త వెనక్కి తగ్గింది. అదనపు రుసుము తీసేసింది. కానీ ‘కేజీయఫ్ 2’ టీమ్ మాత్రం వెనకడుగు వేయలేదు. ఇంకా చెప్పాలంటే అమెజాన్ ప్రైమ్ టీమ్ వెనక్కి తగ్గలేదు. డబ్బులు చెల్లించే చూడండి అని ఫిక్స్ అయ్యింది. ఇదంతా కొత్త సినిమా గురించి కాబట్టి ఓకే. కానీ పాత సినిమాలకు ఈ ఫీచర్ పెడతాం అంటే ఎలా? పెడతామంటే కాదు.. పెట్టేశారు. అవును అది కూడా తెలుగు సినిమాలకు కాదులెండి.
ఇంగ్లిష్ సినిమాలకు, రేపొద్దున తెలుగు సినిమాలకూ ఇదే పని చేస్తారేమో అని ముందే చెబుతున్నాం. జూన్ 9న ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ థియేటర్లలో విడుదలవుతోంది. దీంతో 1996 నుంచి వచ్చిన పాత ‘జురాసిక్’ సినిమాలను చూద్దామని ట్రై చేస్తే ఒక్కోదానికి ₹99 అద్దె చెల్లించమంటున్నారు. అంతేకాదు సినిమా చూడటం మొదలుపెట్టిన 48 గంటల్లోపే పూర్తి చేయాలి. లేదంటే డిలీట్ అయిపోతుంది. అలాగే ‘టాప్ గన్ మావరిక్’ ఒకప్పటి వెర్షన్… అంటే 1980ల్లోని సినిమా చూడాలంటే ప్రైమ్‌లోనే ₹75 రూపాయలు అడుగుతున్నారు. విషయం ఏంటంటే ఇవన్నీ ఈ మధ్య వరకు ఫ్రీగా ఉన్నవే.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!