German: ఆయన విజన్‌.. సూర్య నటన కలిస్తే మరో ఆణిముత్యమే.. నెక్స్ట్‌ ఇదేనట

రెండేళ్లకో సినిమా చేస్తారు పా రంజిత్‌ (Pa. Ranjith) . అన్నీ అదిరిపోయే రెస్పాన్స్‌ అందుకుంటాయి. అలా అని వచ్చిన సినిమాలన్నీ విజయాలు అందుకుంటాయని కాదు. ఆయన పనితనం, ఆలోచన విధానాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని. ఆయన ఇప్పటివరకు చేసిన 8 సినిమాల్లో దాదాపు ఇలా మనసులు గెలుచుకున్నవే ఉంటాయి. తాజాగా ఆయన మనసులు, మనీ గెలుచుకున్న చిత్రం ‘తంగలాన్’ (Thangalaan)   . ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో ఓ పాత సినిమా విషయం మళ్లీ తెరపైకి వచ్చింది.

చాలా ఏళ్ల క్రితం సూర్య  (Suriya) , పా. రంజిత్‌ కలసి ఓ సినిమా చేస్తారు అని వార్తలొచ్చాయి. దాదాపు అంతా ఫిక్స్‌, రేపో మాపో సినిమా ప్రారంభం అని అనుకుంటున్న సమయంలో.. ఆ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ కాంబినేషన్‌ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘తంగలాన్‌’ విజయంతో రంజిత్‌ హుషారుగా ఉన్నారని, ‘కంగువా’ పనులు పూర్తి చేసుకున్నాక సూర్యతో సినిమా చేస్తారని అంటున్నారు.

German

అక్టోబరులో ‘కంగువా’గా (Kanguva) బాక్సాఫీస్‌ దగ్గర సందడి చేయబోతున్నాడు సూర్య. ఆ సినిమా తర్వాత ‘కంగువా 2’ ఉంది. అలాగే ‘తంగలాన్‌ 2’ కూడా ఉందని విక్రమ్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ రెండు సీక్వెల్స్‌ తర్వాత సూర్య – రంజిత్‌ సినిమా ఉంటుందా? లేక ముందే ఉంటుందా అనేది త్వరలో తెలుస్తుంది. సూర్య – రంజిత్‌ కాంబో గురించి గతంలో అనుకున్నప్పుడు ‘జర్మన్‌’ (German) అనే పేరు అనుకున్నారు. మరిప్పుడు కొత్తగా కథ సిద్ధం చేసుకుంటారా? లేక అప్పటి కథనే ఇప్పుడు తీస్తారా? అనేది చూడాలి.

అన్నట్లు కార్తీక్‌ సుబ్బరాజు (Karthik Subbaraj) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సూర్య ఓకే చెప్పాడు. మరి ఈ సినిమా సంగతేంటి అనేది పా.రంజిత్‌ తదుపరి సినిమా తేలితే తెలుస్తుంది. చూడాలి మరి సూర్య నటనకు.. రంజిత్‌ ఆలోచనలు తోడైతే సినిమా వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందా?

స్పెషల్ రోల్ కోసం సత్యదేవ్ అంత తీసుకుంటున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus