Satyadev Remuneration: స్పెషల్ రోల్ కోసం సత్యదేవ్ అంత తీసుకుంటున్నాడా?

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ‘జెర్సీ’ (Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి  (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘#VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. చాలా కాలంగా డిలే అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రాంచరణ్ (Ram Charan) కోసం గౌతమ్ డిజైన్ చేసుకున్న ఓ మాస్ కథని.. విజయ్ దేవరకొండతో చేస్తున్నట్లు ఈ ప్రాజెక్టు ఆరంభంలోనే అందరికీ క్లారిటీ వచ్చింది.

Satyadev Remuneration

హీరోయిన్ గా మొదట శ్రీలీలని (Sreeleela) అనుకున్నారు. కానీ తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ని (Bhagyashree Borse) ఫైనల్ చేశారు. అలాగే ఈ సినిమాలో అతి కీలకమైన పాత్ర కోసం ముందుగా ఓ తమిళ నటుడిని సంప్రదించారు. కానీ వర్కౌట్ కాకపోవడంతో ఆ పాత్రకి సత్యదేవ్ ని ఎంపిక చేసుకోవడం జరిగింది. సినిమాలో అతి కీలకమైన పాత్ర అది. ఇంకా చెప్పాలంటే అది కూడా ఆల్మోస్ట్ హీరో రోల్ వంటిదట. ఇక ఈ పాత్ర కోసం సత్యదేవ్ (Satyadev) రూ.1.5 కోట్ల నుండి రూ.2 కోట్ల వరకు పారితోషికం అనుకుంటున్నట్లు సమాచారం.

సత్యదేవ్ (Satyadev Remuneration) కెరీర్లో అనుకోకుండా గ్యాప్ వచ్చింది.2022 చివర్లో వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) తర్వాత అతని నుండి ఈ ఏడాది ‘కృష్ణమ్మ’ (Krishnamma) వచ్చింది. అలాగే రెండు కూడా ఆడలేదు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు అతని చేతిలో ఉన్నప్పటికీ.. ‘#VD12’ పైనే అతను హోప్స్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇదైనా అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.

మూడు సినిమాలూ బ్లాక్‌బస్టర్‌లే.. ఇప్పుడు నాలుగో సినిమా అంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus