Paagal Movie: ‘పాగల్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!

మాస్ క దాస్… విశ్వక్ సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాగల్’.నివేదా పేతురేజ్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లు. భూమిక కూడా ఓ కీలక పాత్రలో నటించింది. ‘లక్కీ మీడియా’ బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ అధినేత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. రధన్ సంగీతం అందించాడు. టీజర్ ,ట్రైలర్, పాటలతో ఆకట్టుకున్న ‘పాగల్’ సినిమాతో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

ఓపెనింగ్స్ విషయంలో ఈ మూవీ పర్వాలేదు అనిపించింది కానీ బాక్సాఫీస్ వద్ద విజయం మాత్రం సాధించలేకపోయింది. ఆగష్ట్ 14న ఈ చిత్రం విడుదల అయ్యింది. అతి త్వరలో ఓటిటిలో కూడా రిలీజ్ కాబోతుంది. అవును ‘అమెజాన్ ప్రైమ్’ లో ‘పాగల్’ మూవీ విడుదల కాబోతుంది. సెప్టెంబర్ 3 నుండీ ఈ మూవీ స్ట్రీమ్ కాబోతుంది.అంటే థియేటర్లలో విడుదలైన 3 వారాల్లోనే ఈ మూవీ డిజిటల్ రిలీస్ కాబోతుందన్న మాట. ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి సంస్థ ఈ మూవీకి 7.7/10 రేటింగ్ ను ఇచ్చింది.

కాబట్టి ఓటిటిలో ఈ చిత్రాన్ని ఎక్కువ మంది వీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా పడుతూ వచ్చింది. మొదట ఓటిటిలోనే ఈ మూవీని విడుదల చేయాలి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ ఆలోచనని మార్చుకున్నారు. ఇక థియేటర్లలో వర్కౌట్ కానీ ఈ మూవీ ఓటిటిలో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus