మరికొన్ని గంటల్లో గోపీచంద్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. టికెట్ రేట్లను తగ్గించినా ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ లోని అన్ని థియేటర్లలో ఈ సినిమాకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భ్రమరాంబ, ఏషియన్ స్వప్న, ఏఎంబీ సినిమాస్ లో మాత్రమే ఇతర థియేటర్లతో పోలిస్తే ఎక్కువ టికెట్లు బుకింగ్ అయ్యాయి.
ఈ సినిమా కోసం నిర్మాతలు, హీరో, దర్శకుడు వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే కథ మరీ కొత్తగా లేకపోవడంతో మౌత్ టాక్ ను బట్టి సినిమాను చూడాలో వద్దో డిసైడ్ కావాలని చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. వైజాగ్, విజయవాడలో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ను బట్టి తమ సినిమాల రిలీజ్ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని చాలామంది నిర్మాతలు భావిస్తున్నారు.
జులై నెలలో ది వారియర్, కార్తికేయ2, థాంక్యూ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. రామారావు ఆన్ డ్యూటీ కూడా జులైలోనే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో ఏ సినిమా హిట్ గా నిలుస్తుందో ఏ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. గోపీచంద్ గత సినిమాలు ఫ్లాప్ కావడం కూడా పక్కా కమర్షియల్ బుకింగ్స్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయని సమాచారం అందుతోంది.
గోపీచంద్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గోపీచంద్ తర్వాత సినిమా శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. వరుస ఫ్లాపుల వల్ల గోపీచంద్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.