గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘జిఎ2 పిక్చర్స్’ ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ల బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 1 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సత్యరాజ్, సప్తగిరి, రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, చిత్ర శుక్ల మొదలైన వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘సీటీమార్’ తో కం బ్యాక్ ఇచ్చిన గోపీచంద్.. వరుస విజయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘గీతా ఆర్ట్స్’ సెకండ్ బ్యానర్ కావడంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. టీజర్, ట్రైలర్ లకి కూడా మంచి రెస్పాన్స్ రావడం తో మూవీకి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
5.50 cr
సీడెడ్
2.50 cr
ఉత్తరాంధ్ర
2.00 cr
ఈస్ట్
1.35 cr
వెస్ట్
1.10 cr
గుంటూరు
1.50 cr
కృష్ణా
1.20 cr
నెల్లూరు
0.75 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
15.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.60 cr
ఓవర్సీస్
1.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
17.50 cr
‘పక్కా కమర్షియల్’ చిత్రానికి రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదిలా కనిపించినా.. ఈ మధ్య కాలంలో గోపీచంద్ సినిమాలు ఇంత టార్గెట్ ను రీచ్ అయ్యింది లేదు. ‘సీటీమార్’ చిత్రం రూ.11 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది.
అయితే ఈ మధ్య కాలంలో సరైన కమర్షియల్ సినిమా పడి చాలా రోజులు అయ్యింది. ‘పక్కా కమర్షియల్’ కి కనుక పాజిటివ్ టాక్ వస్తే ఈ టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.