బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే అస్త్ర కోసం హౌస్ మేట్స్ పోటీ పడి మరీ టాస్క్ లు ఆడుతున్నారు. రేస్ లో ఒక్కొక్కరు అవుట్ అవుతూ వచ్చారు. ఫైనల్ గా నలుగురు మిగిలారు. ఇందులో అమర్ దీప్ టాప్ లో ఉంటే, తర్వాత పల్లవి ప్రశాంత్ ఇంకా అర్జున్ ఉన్నారు. లీస్ట్ లో గౌతమ్ ఉన్నాడు. కాబట్టి గౌతమ్ ని రేస్ నుంచీ తప్పించాడు బిగ్బాస్. గౌతమ్ వెళ్లిపోతూ తన పాయింట్స్ ని అర్జున్ కి ఇస్తాడనే అనుకున్నారు. కానీ, గౌతమ్ ప్రియాంక చెప్పిందని అమర్ కి ఇచ్చాడు.
అంతేకాదు, అమర్ కి పాయింట్స్ ఇస్తూ ఇంకోసారి ప్రియాంకని ఏమీ అనద్దని చాలా క్లియర్ గా చెప్పాడు. దీనికి శోభాశెట్టి హర్ట్ అయ్యింది. ఏదైనా పాయింట్స్ ఇస్తే ఇవ్వు కానీ, అలా చెప్పి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పింది. ఇక అర్జున్ తనకి పాయింట్స్ రాలేదని కొద్దిగా ఫీల్ అయ్యాడు. శివాజీ పక్కనుంచీ పాటలు పాడుతూ జోకులు వేస్తూ అర్జున్ ని హుషారుగా ఉండేలా చేశాడు. మరోపక్క గౌతమ్ పాయింట్స్ కూడా కలుపుకుంటే అమర్ 1000 పాయింట్స్ దక్కించుకున్నాడు. ఇక్కడే బిగ్ బాస్ తర్వాత టాస్క్ లలో ట్విస్ట్ ఇచ్చాడు.
పదో టాస్క్, పదకొండో టాస్క్ రెండు టాస్క్ లలో అర్జున్ విజయం సాధించి 200 పాయింట్స్ దక్కించుకున్నాడు. దీంతో పల్లవి ప్రశాంత్ ని బీట్ చేసి మరీ ఫినాలే రేస్ లోకి అడుగుపెట్టాడు. పల్లవి ప్రశాంత్ మూడో స్థానంలో ఉండటం వల్ల రేస్ నుంచీ అవుట్ అయ్యాడు. దీంతో అమర్ దీప్ ఇంకా అర్జున్ ఇద్దరు మాత్రమే ఫైనల్ రేస్ కి మిగిలారు. అర్జున్ ఇంకా అమర్ దీప్ ఇద్దరి మద్యలోనే ఫినాలే టిక్కెట్ కోసం టాస్క్ జరగబోతోంది.
ఈ టాస్క్ లో గెలిచిన వాళ్లకి డైరెక్ట్ గా ఫినాలేలోకి అడుగుపెట్టే అవకాశం వస్తుంది. టాప్ 5 కంటెస్టెంట్ లో ఫస్ట్ కంటెస్టెంట్ అవుతారు. అయితే, అమర్ దీప్ నామినేషన్స్ లో లేడు కాబట్టి , గెలిస్తే నేరుగా ఫినాలేకి వెళ్లిపోతాడు. ఒకవేళ అర్జున్ గెలిస్తే ఈవారం నామినేషన్స్ నుంచీ సేఫ్ అవ్వాల్సి వస్తుంది. మొత్తానికి ఈసీజన్ లో బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు ఇస్తునే ఉన్నాడు.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!