Pallavi Prashanth: రతికపై షాకింగ్ కామెంట్స్ చేసిన పల్లవి ప్రశాంత్ పేరెంట్స్.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ షో సీజన్7 మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటూ గత సీజన్లతో పోలిస్తే హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్7 కంటెస్టెంట్ రతిక గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ విషయంలో ఒక్కో సమయంలో ఒక్కో విధంగా రతిక ప్రవర్తించిన సంగతి తెలిసిందే. అయితే రతిక ప్రవర్తన గురించి పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మా కొడుకు (Pallavi Prashanth) బిగ్ బాస్ షోకు వెళ్లినందుకు సంతోషంగా ఉందని కానీ అమర్ దీప్ నా కొడుకును ఏందిరా అని అనడంతో బాధ వేసిందని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ తెలిపారు. నా కొడుకును రైతు అని హేళన చేస్తున్నారని బిగ్ బాస్ హౌస్ లో అందరూ సమానమేనని అదుంది ఇదుందీ అని విర్రవీగొద్దని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ కామెంట్లు చేశారు. నా కొడుకు ఒకసారి లవ్ సాంగ్ చేస్తే 7 లక్షల రూపాయలు వచ్చాయని వాళ్లు తెలిపారు.

ఆ డబ్బులను కొడుకు ఫ్రెండ్స్ తీసుకుని మోసం చేశారని ఆ సమయంలో నా కొడుకు చాలా ఏడ్చాడని ఒకరోజైతే చస్తానని పొలం దగ్గరకు వెళ్లాడని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ చెప్పుకొచ్చారు. నీకే కష్టం వచ్చినా మేముంటామని ఫోన్ కొనిచ్చామని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ వెల్లడించారు. రతిక మా కొడుకును వాడుకుందని వాళ్లు చెప్పుకొచ్చారు. ప్రశాంత్ తో ఉండటం వల్ల అతడి ఓట్లు తనకు కూడా వస్తాయని రతిక భావించిందని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ పేర్కొన్నారు.

ప్రశాంత్ అందరినీ అక్కాచెల్లి అనుకుంటూ మాట్లాడతాడని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ కామెంట్లు చేశారు. పల్లవి ప్రశాంత్ ఎటువంటి దురాలోచన చేయడని పలవి ప్రశాంత్ పేరెంట్స్ అన్నారు. రీల్స్ చేయడం ద్వారా మా కొడుకు ఫేమస్ అయ్యాడని వాళ్లు తెలిపారు. పల్లవి ప్రశాంత్ కు పెళ్లి చేయాలనే ఆలోచన ఉందని బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ కు పెళ్లి చేస్తామని వాళ్లు వెల్లడించారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus