బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం నామినేషన్స్ మంటల్లో మెంటల్ ఎక్కించాయి. హౌస్ మేట్స్ కడుపులో పుట్టించిన మంటలు హౌస్ లో సెగలు రేకెత్తించాయి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ చేసిన నామినేషన్స్ హైలెట్ అయ్యాయి. అంతేకాదు, పల్లవి ప్రసాంత్ బాడీ లాంగ్వేజ్ మాటకి మాట చెప్పడం అనేది సీరియల్ బ్యాచ్ కి విసుగు తెప్పించాయి. దీంతో ఇరిటేట్ అయిన వాళ్లు నోరుజారే పరిస్థితికి వచ్చింది. అసలు లైవ్ లో ఏం జరిగిందంటే.,
పల్లవి ప్రశాంత్ వచ్చి ఫస్ట్ గౌతమ్ ని నామినేట్ చేశాడు. ఫోటో టాస్క్ గురించి ఇక్కడ డిస్కషన్ పెట్టాడు. చాలా వారాలు అయిపోయిన తర్వాత మళ్లీ దానిని తెరపైకి తెచ్చాడు ప్రశాంత్. ఇక్కడే గౌతమ్ చెప్పిన సినిమా డైలాగ్స్, ప్రశాంత్ తొడగొట్టడం అనేది హైలెట్ అయ్యింది. ఇక తర్వాత అమర్ ని నామినేట్ చేశాడు ప్రశాంత్. గేమ్ లో శివాజీని తప్పించడం నచ్చలేదని, నువ్వు చెప్పిన రీజన్ చాలా సిల్లీగా ఉందని అన్నాడు. అలాగే భోలేని ఆట ఆడలేదని చెప్పడం కరెక్ట్ కాదని వాదించాడు.
దీనికి అమర్ సాలిడ్ గా ఆన్సర్ ఇచ్చాడు. వాళ్లని ఏదో అంటే నీకెందుకురా నొప్పి అంటూ అమర్ ఎదురుదాడి చేశాడు. ఇద్దరి మద్యలో మాటకి మాట పెరిగింది. ఇక్కడ భోలే షవాలి మద్యలో ఆయన టీమే ఆయన చక్కగా చూస్కోలేడు.. మనకెందుకు అబ్బా అంటూ ప్రశాంత్ తో మాట్లాడాడు. దీనికి ఫ్రస్టేట్ అయిన అమర్ మద్యలో మాట్లాడితే పగిలిపోద్ది అంటూ కుర్చీని తన్నాడు. దీంతో హౌస్ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. అంతేకాదు, పక్కనున్న శోభాశెట్టి కూడా రెచ్చిపోయింది. భోలే పై సివంగిలా అరిచింది. భోలే చేష్టలకి, మాటలకి ఇంకా గట్టిగా అరిచింది.
నా టీమ్ లో ఉన్నాడు అమర్ అందుకే మాట్లాడుతున్నా, నువ్వెందుకు మద్యలో దూరావ్ అంటూ ఇచ్చిపారేసింది. ఇక మరోవైపు అమర్ చెవిలో ఏదో గుస గుసలు మొదలు పెట్టాడు గౌతమ్. దీనికి పల్లవి ప్రశాంత్ కి మండింది. అందుకే ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు, చెవుల్లో గొణుగుడు కాదు అంటూ గౌతమ్ తో అన్నాడు. దీనికి రెచ్చిపోయిన గౌతమ్ ఏం మాట్లాడానో చెప్పరా అంటూ అరుస్తూ,, మూస్కుని కూర్చో పల్లవి ప్రశాంత్ అంటూ గట్టిగా అరిచాడు. ఆ తర్వాత నీతో మాట్లాడే హక్కు – అర్హత నీకు లేదు దొబ్బేయ్ అంటూ గౌతమ్ రెచ్చిపోయాడు.
మరోవైపు అమర్ కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ పై విరుచుకుపడ్డాడు. శివాజీని నేను ఫిజికల్ టాస్క్ వస్తే ఆడలేడని తప్పించానని ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు. అలాగే, ప్రియాంకని నువ్వెందుకు తప్పించావో చెప్పు అంటూ నిలదీశాడు. అది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే అంటూ మాట్లాడాడు. అంతేకాదు, మద్యలో దూరిన వాళ్లందరినీ ఉద్దేశ్యించి నేను పాయింట్ మాట్లాడుతున్నా.. ఇలా మీరు మద్యలో దూరతారు కాబట్టే., వాడికి ప్లస్ అయిపోతోందని , మద్యలో వెధవని నేను అవుతున్నానని అన్నాడు.
అమర్ శివాజీ కోసం, భోలే కోసం నన్ను నామినేట్ చేస్తున్నావ్ కదా అంటూ మాట్లాడితే, లేదని నా దగ్గర పాయింట్ ఉందని ప్రసాంత్ వాదించాడు. దీంతో అమర్ కి వెర్రికోపం వచ్చేసింది. నన్ను ఏకినా, పీకినా, లాగినా నేను ఇక్కడ్నుంచీ కప్ తోనే పోతా.. కప్ కొట్టే పోతా అంటూ గట్టిగా అరిచాడు. నన్ను ఇక్కడ్నుంచీ పంపించాలని ఎంత ఎదవ ప్రయత్నాలు చేసుకున్నా కూడా నేను కప్ గెలిచే పోతా అంటూ రెచ్చిపోయి అరిచాడు. ఇక్కడే అమర్ నేను చేసింది తప్పు కాదు అని గట్టిగా అరిచాడు.
దీనికి పల్లవి ప్రసాంత్ తప్పే తప్పే అంటూ చుట్టూ తిరిగాడు. దీంతో ఫస్ట్ టైమ్ ఈ నాకొడుకు తప్పు చేశాడు అంటూ అమర్ దీప్ నోరుజారాడు. అంతకుముందు గౌతమ్ దొబ్బేయ్ అన్నాడు. తర్వాత అమర్ ఈ నాకొడుకు అన్నాడు. దీంతో పల్లవి ప్రశాంత్ మరోసారి హీరో అయిపోయాడు. అనసవరంగా నోరు జారిన సీరియల్ బ్యాచ్ మొత్తం ఈ నామినేషన్స్ లో వాళ్ల ఫోటోని వాళ్లే తగలపెట్టుకున్నారు. అదీ మేటర్.