బుల్లితెరపై ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ పొందుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే… ఎపిసోడ్ ప్రారంభంలో కాలేజ్ మేనేజర్ నరేష్ జగతి వద్దకు రావడంతో కాలేజీ స్టాఫ్ కి ఇంకా శాలరీస్ పడకపోవడం ఏంటి అంటూ మేనేజర్ పై ఫైర్ అవుతుంది నేను కూడా పని హడావిడిలో ఉండి చూసుకోలేదు మేడం అంటూ మేనేజర్ చెప్పగా పని హడావిడిలో ఉన్నావా లేక శైలేంద్ర స్నేహం చేస్తూ బిజీగా ఉన్నావా అంటూ తనపై కోప్పడుతుంది. అసలేం జరిగిందో బ్యాంకుకు వెళ్లి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని చెబుతుంది.
ఇక మేనేజర్ తో పాటు మహేంద్రను కూడా బ్యాంకుకు వెళ్ళమని జగతి చెప్పడంతో మహేంద్ర నువ్వు టెన్షన్ పడకు జగతి వెళ్లి నేను ఏమైందో కనుక్కుంటానని ఇద్దరు వెళ్తుంటారు అంతలోపు ఫణీంద్ర శైలేంద్ర అక్కడికి రావడంతో జరిగిన విషయం ఫణీంద్ర కు చెప్పగా మరి ఈ విషయానికి నువ్వు వెళ్లడం ఎందుకు శైలేంద్రని పంపించు ఇలా పనులు చెబుతుంటేనే కదా తను కూడా తెలుసుకుంటారు అని చెప్పడంతో మహేంద్ర ఫణీంద్ర మేనేజర్ తో పాటు బ్యాంకు కి పంపిస్తారు. మరోవైపు రిషి ఏంజెల్ గురించి ఆలోచిస్తూ డిస్టర్బ్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు దీంతో అనుకోకుండా ఆటోకి కార్ తగిలించడంతో ఆటో డ్రైవర్ అవుతాడు.
ఏంటి ఈ డ్రైవింగ్ కాస్త చూసి నడపాలి కదా అంటూ ఆటో డ్రైవర్ రిషిని తిడుతూ ఉండగా ఆటలో ఉన్నటువంటి వసుదార బయటకు రావడంతో రీషిని చూసి షాక్ అవుతుంది. ఇక వసుధార ఆటో డ్రైవర్ కు సారి చెప్పడంతో మీరు ఎందుకు మేడం సారీ చెబుతున్నారు అనగా ఈసారి నాకు తెలుసు. ఆయన ఎప్పుడూ అలా డ్రైవింగ్ చేయరు అని చెప్పి తనని పంపిస్తుంది. అనంతరం రిషితో మాట్లాడుతూ ఇలా డిస్టర్బ్ గా డ్రైవింగ్ చేయడం ఏంటి సార్ ఇంత డిస్టర్బ్ గా ఉన్నప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా అని చెప్పడంతో మీ ఉపన్యాసాలు ఆపుతారా అంటూ రిషి తిరిగి కారులో వెళ్లడానికి వెళుతుండగా వసుధార అడ్డుకుంటుంది.
మీరు ఇప్పుడు చాలా డిస్టర్బ్ గా ఉన్నారు ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేయడం మంచిది కాదు అంటూ వసుధారని డ్రైవ్ చేస్తూ కాలేజీకి వెళ్తారు కాలేజీకి వెళ్లగానే అటెండర్ వచ్చి మళ్లీ ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తాడు ఆయన సిలబస్ తొందరగా కంప్లీట్ చేయమని వసుధార మేడంకి కూడా ఈ విషయం చెప్పమని చెప్పడమే కాకుండా అవసరమైతే స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకోమని చెబుతారు. మరోవైపు డిస్టర్బ్ గా ఉన్నటువంటి రిషి ఇప్పుడు నేను క్లాస్ చెప్పలేను లాస్ట్ క్లాస్ రివైండ్ చేసుకోమని చెప్పగా పాండియన్ మాత్రం రిషి ని చూసి సందేహం వ్యక్తం చేస్తుంటారు.
రిషి కోసం వసుధార క్లాస్ కి రాగా అక్కడ రిషి ఉండడు. పాండియన్ ను పిలిచి వసుధార ఏమైందని అడగడంతో ఏమైందో తెలియదు గత కొద్ది రోజులుగా సార్ చాలా డిస్టర్బ్ గా ఉన్నారు క్లాసెస్ కూడా సరిగా చెప్పడం లేదు తనకేదైనా పర్సనల్ ప్రాబ్లం ఉందా అంటూ అడగడంతో అదేమీ లేదు ముందు మీరు చదువుపై కాన్సన్ట్రేషన్ చేయండి అంటూ రిషి క్యాబిన్ వద్దకు వెళ్ళగా అక్కడ రిషి దీర్ఘాలోచనలో ఉంటారు. ఈ సమయంలో మాట్లాడటం మంచిది కాదని చెప్పి వసుధార వెళ్ళిపోతుంది అనంతరం రీషికి ప్రిన్సిపాల్ ఫోన్ చేసి వసుధార మేడం మీ దగ్గరికి వచ్చారా రమ్మని చెప్పానాడటంతో లేదులెండి సర్ నేనే వెళ్తానని ఫోన్ పెట్టేస్తాడు.
మరోవైపు మేనేజర్ బ్యాంకు నుంచి కాలేజ్ కి వచ్చి మన అకౌంట్స్ అన్నింటిని సీజ్ చేశారు మేడం ట్రాన్సాక్షన్స్ ఏవైనా సమస్యలు ఉన్నాయేమో అని చెప్పడంతో వాటన్నింటిని సాల్వ్ చేసుకొని రావాలి కదా అంటూ జగతి కోప్పడుతుంది బ్యాంక్ క్లోజింగ్ టైం అయింది మరో మూడు రోజులపాటు బ్యాంకుకు సెలవులు కూడా ఉన్నాయి అని చెప్పడంతో జగతి టెన్షన్ పడుతుంది. మూడు రోజుల వరకు మనం స్టాప్ కి శాలరీస్ ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు ఈ విషయం బావగారికి తెలిస్తే బాధపడతారు. నా నగలు అన్నింటిని తాకట్టు పెట్టి స్టాప్ అందరికీ సాలరీస్ ఇచ్చేద్దాం తర్వాత మనం ఆ డబ్బు తీసుకుందాం అంటూ జగతి మాట్లాడుతుంది.
మరోవైపు ప్రిన్సిపల్ రమ్మన్నా కూడా రాకుండా ఉన్నారు ఏంటి ఈగో ప్రాబ్లమా అంటూ రిషి వసుధార దగ్గరికి వెళ్లి అనడంతో వసుధర నేను వచ్చాను సర్ మీరు చాలా డిస్టర్బ్ గా ఏదో ఆలోచనలో ఉంటే డిస్టర్బ్ చేయకూడదని వచ్చేసాను అని చెబుతుంది. అయినా ఇది చిన్న విషయం పడుతున్నారు ఎవరి మీద కోపం అంతా నా మీద చూపించకండి అంటూ వసుధార పైకి మాట్లాడిన మీ కోపం, ప్రేమ, స్వేచ్ఛ అంతా నాదే అని మనసులో అనుకుంటుంది ఇంతటితో (Guppedantha Manasu ) ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.