Vaisshnav Tej: ఎట్టకేలకు కొత్త సినిమా స్టార్ట్‌ చేయబోతున్న వైష్ణవ్‌.. టైటిల్‌ ఇదేనా?

హిట్‌ సినిమాతో కెరీర్‌ ప్రారంభించి.. ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌(Panja Vaisshnav Tej). ఆయన నుండి సినిమా వచ్చి ఏడాది దాటుతున్నా.. ఇంకా కొత్త సినిమా పనులు స్టార్ట్‌ చేయలేదు. దీంతో కొత్త సినిమా ఎప్పుడు? అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే ఆయన నుండి కానీ, ఆయన టీమ్‌ నుండి కానీ ఎలాంటి సమాచారం లేదు. తాజాగా వైష్ణవ్‌ కొత్త సినిమా టైటిల్‌ ఇదే అంటూ ఓ సినిమా పేరు బయటకు వచ్చింది.

Vaisshnav Tej

‘ఉప్పెన’ (Uppena) సినిమాతో అరంగేట్రంలోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్‌ తేజ్‌. ఆ తర్వాత ‘కొండ పొలం’ (Konda Polam), ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga), ‘ఆదికేశవ’ (Aadikeshava) అంటూ మూడు రకాల సినిమాలు చేశాడు. అయితే మూడుకు మూడు సినిమాల ఫలితాలు తేడా కొట్టేశాయి. దీంతో ఈసారి బలంగా బౌన్స్‌బ్యాక్‌ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. చాలా కథలు వింటున్నా, ఏదీ ఓకే చేయడం లేదు అని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో దర్శకుడు కృష్ణ చైతన్య చెప్పిన ఓ కథకు వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమాతో మంచి విజయం అందుకున్న కృష్ణ చైతన్య (Krishna Chaitanya) ఇప్పుడు వైష్ణవ్‌ తేజ్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నారట. అలా రూపొందనున్న సినిమాకు ‘వచ్చాడయ్యో సామీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తారట. త్వరలో సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

ఇక వైష్ణవ్‌ (Vaisshnav Tej) సంగతి చూస్తే.. తొలి సినిమాతోనే కుర్రాడిలో ఏదో స్పార్క్‌ ఉంది అని నిరూపించాడు. ఆయన కళ్లే ఆయన యూఎస్‌పీ అని కూడా అన్నారు. కానీ కట్‌ చేస్తే ఏ సినిమా చేసినా సరైన ఫలితం రావడం లేదు. దీంతో కథల ఎంపిక విషయంలో జాగ్రత్త లేకపోవడమే కారణం అని అంటున్నారు. ఇప్పుడు ‘వచ్చాడయ్యో సామీ’ ఎలాంటి కథో మరి.

 ‘దావూదీ’ సాంగ్ తో అది మరోసారి ప్రూవ్ చేశావ్ కొరటాల.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus