పని మాత్రమే నువ్వు చెయ్.. ఫలితాన్ని వదిలేయ్.. అనే మాటని నమ్మిన హీరో గోపిచంద్. ప్రముఖ నిర్మాత కొడుకు అయి ఉండి.. విలన్ పాత్రలు చేయడానికి ఒకే చెప్పారు. నటుడిని అని నిరూపించారు. పరుగుపందేలతో పని లేకుండా నచ్చిన కథని చేసుకుంటూ పాతిక చిత్రాల మైలురాయిని చేరుకున్నారు. తన 25 వ చిత్రాన్ని నూతన దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో చేసి తన విజయ పంతాన్ని నెగ్గించుకున్నారు. యాక్షన్ అండ్ మెసెజ్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన పంతం జూలై 5 న విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ మంచి కలక్షన్స్ రాబట్టింది.
గోపిచంద్ సరసన మెహ్రీన్ జోడిగా నటించిన ఈ మూవీ మొదటి రోజే దాదాపు 5.2 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 3.22 కోట్ల షేర్ ను రాబట్టింది. సత్యసాయి ఆర్ట్స్ పతాకంఫై కే కే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా తొలి వీకెండ్ కలక్షన్స్ కూడా చిత్ర బృందానికి ఆనందాన్ని మిగిల్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ (నాలుగురోజుల్లో) 10.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 6.77 కోట్ల షేర్ ను రాబట్టి తన కెరీర్ లోనే తొలి వీకెండ్ ఎక్కువ షేర్ వసూలు చేసిన చిత్రంగా పంతం నిలిచింది.
ఏరియా : కలక్షన్స్
నైజాం : 1 .96 కోట్లు
సీడెడ్ : 1 .05 కోట్లుఉత్తరాంధ్ర : 83 లక్షలు
గుంటూరు : 64 లక్షలుకృష్ణ : 43 లక్షలు
ఈస్ట్ గోదావరి : 46 కోట్లు
వెస్ట్ గోదావరి : 37 లక్షలునెల్లూరు : 26 లక్షలు
ఇతర ప్రాంతాల్లో : 50 లక్షలు
ఓవర్సీస్ : 25 లక్షలుమొత్తం : 6 .77 కోట్లు