ఫ్రెండ్ మరోసారి విలన్ అవుతున్నాడా? ప్రభాస్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా?
- January 24, 2026 / 07:34 PM ISTByFilmy Focus Desk
ఆ మధ్య గోపీచంద్ ఏదో సినిమా ప్రచారం కోసం మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎక్కువమంది అడిగిన ప్రశ్న.. మళ్లీ ప్రభాస్‌తో ఎప్పుడు కలసి నటిస్తారు అని. ఎందుకంటే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. కలసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించాలి అని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కోరుకుంటారు. ‘వర్షం’ సినిమాలో వీరి కాంబినేషన్ భలే వర్కవుట్ అయింది కూడా. అలా మరోసారి హీరో – విలన్ అయినా చేయొచ్చు కదా అని అన్నారప్పుడు. ఆ మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయా? సందీప్ రెడ్డి వంగా నిజం చేస్తున్నారా? మధ్యలోకి ఈయన ఎందుకు వచ్చారు అనేగా డౌట్.
Gopichand
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసింది. ఇటీవల సినిమా పనులు జోరందుకున్నాయి. ఈ క్రమంలో కాస్టింగ్ పనులు అన్నీ ఫైనల్ చేసేసుకున్నారట. అలా విలన్ పాత్ర విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేశారు అని చెబుతున్నారు. ఆయనే గోపీచంద్ అని సమాచారం. ఈ విషయంలో ఇంకా అధికారిక సమాచారం లేదు కానీ.. ప్రభాస్‌కి సరైన విలన్‌గా గోపీచంద్ బాగుంటాడు అని అంటున్నారు. ఇలాంటి పాత్ర వస్తే చేయడానికి నేను రెడీ అని గోపీచంద్ కూడా చెప్పాడు.

ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరితే.. ‘వర్షం’ సినిమా తర్వాత సుమారు రెండు దశాబ్దాలకు ఇద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది మాత్రం ఇంకా గోపీచంద్ హీరోగానే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి.. ‘స్పిరిట్’లో ఆయన విలన్‌గా చేయడం లేదేమో అనే డౌట్ కూడా రెయిజ్ చేస్తున్నారు. అయితే గోపీచంద్ కెరీర్ అంత హైలో ఏమీ లేదు. కాబట్టి ఈ సినిమాతోనే తన లైన్ మార్చుకుని ఇటువైపు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పాత్రలు, లుక్‌లు, ఆడియోలతో సందీప్ రెడ్డి వంగా హైప్‌ను బాగానే పెంచారు. ఇప్పుడు గోపీచంద్ నటించడం పక్కా అయితే ఆ హైప్ మరింత పెరుగుతుంది. అన్నట్లు ఇలాంటి సినిమా గోపీచంద్ మళ్లీ విలన్ అయితే కెరీర్ కొత్త మలుపు తిరుగుతుంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా విలన్లకు కూడా మంచి క్రేజ్ వస్తుంది. చూశాంగా ‘యానిమల్’.















