Parasuram Remuneration: సర్కారీ వారి పాట కోసం పరశురామ్ అంత రెమ్యూనరేషన్ తీసుకున్నారా?

నిఖిల్ హీరోగా తెరకెక్కిన యువత సినిమా ద్వారా డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు పరశురామ్. ఆ తర్వాత ఈయన సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు వంటి పలు చిత్రాలకు దర్శకుడిగా పని చేసినా ఏ సినిమా తనకు గుర్తింపు తీసుకు రాలేదు.అయితే విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన గీతా గోవిందం సినిమాకు దర్శకత్వం వహించినందుకు గాను ఆయనకు ఎంతో స్టార్ డమ్ వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమా తరువాత పరశురామ్ ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు.

ఇలా మహేష్ బాబుతో కలిసి సర్కారీ వారి పాట చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా కూడా మొదటి షో నుంచి మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత విడుదలైన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమా కోసం భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం పరశురామ్ ఏకంగా 10 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈయన రెమ్యునరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఈ క్రమంలో కొంతమంది ఈ విషయంపై స్పందించి గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వం వహించిన చిత్రం సర్కారీ వారి పాట.అది కూడా మహేష్ బాబు హీరో కనుక ఈ సినిమా కోసం డైరెక్టర్ కు భారీ మొత్తంలోనే చెల్లించి ఉంటారని పలువురు వారి అభిప్రాయాలను తెలియ జేస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus