Parasuram, Mahesh Babu: మహేష్ తనను అలా చూసుకున్నారన్న పరశురామ్!

ఈ మధ్య కాలంలో సర్కారు వారి పాట సినిమా గురించి వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు, పరశురామ్ మధ్య విభేదాలు ఉన్నాయని సినిమా విషయంలో మహేష్ సంతృప్తిని వ్యక్తం చేయలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. పరశురామ్ సినిమాలో హీరో లేకుండా ఒక్క సీన్ ను కూడా రాసుకోలేదని ఇలా చేయడం మహేష్ కు మరింత కోపం తెప్పించిందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పరశురామ్ వైరల్ అయిన కామెంట్లకు సంబంధించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

మహేష్ బాబు తనపై చిరాకు పడటం వాస్తవమేనని పెద్ద సినిమాలు చేసే సమయంలో కచ్చితంగా చిరాకులు ఉంటాయని పరశురామ్ చెప్పుకొచ్చారు. సర్కారు వారి పాట షూట్ మొదలైన తర్వాత మూడు దశల కరోనా వచ్చిందని మహేష్ ఒకే స్క్రిప్ట్ ను మూడేళ్ల పాటు మోశారని ఆయన వెల్లడించారు. ఒక స్క్రిప్ట్ ను అంత కాలం మోయడం కష్టమైన పని అని ఆ ఒత్తిడిలో ఒకట్రెండు ఘటనలు జరిగినా మహేష్ మాత్రం తనను సోదరుడిలా చూసుకున్నాడని పరశురామ్ వెల్లడించారు.

మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ లో వేలు పెట్టరని ఇద్దరి మధ్య గొడవలు వచ్చేంత గ్యాప్ మాత్రం రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి సినిమాకు ప్రాక్టికల్ గా ఇబ్బందులు కచ్చితంగా ఉంటాయని ఆయన అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయాల్సిన మూవీ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తే చిరాకు వస్తుందని అయితే ఆ చిరాకుల వల్ల సినిమాకు మాత్రం ఇబ్బంది కలగలేదని ఆయన వెల్లడించారు.

మహేష్ బాబు ఎవరికైనా ఒక ఛాన్స్ ఇస్తారని ఆ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. సర్కారు వారి పాట సినిమాకు ఒకే టైటిల్ ను అనుకున్నానని ఆ టైటిల్ నే ఫిక్స్ చేశానని పరశురామ్ అన్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus