ఈ ఏడాది విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో విరూపాక్ష సినిమా ఒకటి. సుకుమార్ స్క్రీన్ ప్లే, కార్తీక్ దండు డైరెక్షన్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. అయితే పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఈ సినిమా గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రైటర్ ప్రభాకర్ విరూపాక్ష మూవీకి అందించిన డైలాగ్స్ సహజంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
ఇండస్ట్రీలో ఒక్కో రైటర్ డైలాగ్ లను ఒక్కో విధంగా రాస్తారని విరూపాక్ష డైలాగ్ రైటర్ మాత్రం ఎంతో శ్రద్ధగా డైలాగ్స్ రాయడం జరిగిందని పరుచూరి పేర్కొన్నారు. విరూపాక్ష మూవీ కథ చిత్రమైనదని పల్లెటూరిలో జరిగే కథను డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారని పరుచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం థియేటర్లలో మూడు వారాలు సినిమా ఆడితే గొప్ప అని పరుచూరి చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితుల మధ్య విరూపాక్ష మూవీ 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిందని ఆయన కామెంట్లు చేశారు.
ప్రేక్షకులకు విరూపాక్ష(Virupaksha) మూవీ థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇచ్చిందంటే అది మామూలు విషయం కాదని పరుచూరి పేర్కొన్నారు. ప్రేమించిన యువతి కొరకు హీరో సమస్యను పరిష్కరించిన తీరు బాగుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాలు ఉండటం వల్లే విరూపాక్ష సక్సెస్ కాలేదని పరుచూరి చెప్పుకొచ్చారు.
కథ వల్లే విరూపాక్షమూవీ సక్సెస్ సాధించిందని పరుచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. సాయితేజ్, సంయుక్త, అజయ్, కార్తీక్ దండు ఈ నలుగురికి మంచి మార్కులు వేయొచ్చని పరుచూరి వెల్లడించారు. విరూపాక్ష మూవీలో రాజీవ్ కనకాల రోల్ పెద్ద ట్విస్ట్ అని ఆయన అన్నారు. సంయుక్త యాక్టింగ్ ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. విరూపాక్ష మూవీ నిర్మాతలకు మంచి లాభాలను అందించిందని పరుచూరి చెప్పుకొచ్చారు.