కొంతమంది హీరోలు అందంగా ఉంటారు, బాగా నటిస్తారు, మంచిగా ఫైట్లు చేస్తారు… కానీ స్టార్ హీరో హోదాకు రెండు, మూడుడగుల దూరంలో నిలిచిపోతారు. కారణాలు ఏమైనా కావొచ్చు సరైన స్థానంలో అయితే నిలవలేకపోయారు. అలాంటి హీరోల్లో సురేశ్ ఒకరు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న సురేశ్ గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన మనసులో మాటలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఓ శోభన్‌బాబును మిస్ అయ్యాం అని కూడా అన్నారు.
‘మరో క్విట్ ఇండియా’ చిన్న సినిమా కావటంతో ఖర్చు తగ్గించడానికి అందరం కలిసి చిన్న రూమ్‌లో సర్దుకుపోయేవాళ్లట. అలా వాణీ విశ్వనాథ్, సురేశ్, పరుచూరి గోపాలకృష్ణ ఒకే రూమ్‌లో ఉండేవాళ్లట. రాఘవేంద్రరావు నవ్విస్తే ఆనందపడతారనే విషయం తెలిసిందే. అయితే సురేశ్ నవ్వించి ఆనందపడతారట. సురేశ్ బాడీలోనే డ్యాన్స్ ఉంటుందట. ‘‘సురేశ్ ఎక్కువగా తమిళంలో సినిమాలు చేశారు. అవే సినిమాలు వరుసగా తెలుగులో చేసి ఉంటే మరో శోభన్‌బాబు అయ్యేవారు’’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.
అన్యాయాలు, అక్రమాలు చేసేవారిని స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో సురేశ్ అంతం చేసేలా కథను అనుకున్నారట. దాని కోసం భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు గెటప్‌లు సురేశ్‌కు వేసి టెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత కథ మారిపోయిందట. ఇటీవల బాలకృష్ణ సినిమాలో సురేశ్ ప్రతినాయకుడిగా నటించారు. సురేశ్ కూడా ఇప్పుడు కొత్త పాత్రలు వేయాలి. ఇప్పుడు మళ్లీ రావాల్సిన అవసరం ఉంది. కొత్త పాత్రల్లో నటించి రాణించాలని కోరుకుంటున్నా అంటూ పరుచూరి గోపాలకృష్ణ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!