సినిమా పరిశ్రమలో ఓ అపవాదు ఉంది.. ఒక్కోసారి అది నిజం కూడా అయింది అనుకోండి. అదే.. సినిమాల్లో ఒకసారి ఒక తరహా పాత్ర చేశామంటే.. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వరుస కడతాయి. హీరోల విషయంలో ఈ విషయం పెద్దగా ఇబ్బంది పెట్టదు.. ఎందుకంటే దానికి ఇమేజ్ అనే పేరు పెట్టేశారు. అదే హీరోయిన్ విషయానికొస్తే ముద్ర వేసి అలాంటి పాత్రలే వరుసగా ఇస్తుంటారు. ఈ విషయం మీద తాజాగా పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu) స్పందించింది.
Parvathy Thiruvothu
హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో ఏదైనా ఒక సినిమాలో తల్లి పాత్ర పోషించడం అంటే రిస్కే. ఎందుకంటే ఆ తర్వాత రెగ్యులర్ హీరోయిన్ రోల్ రావడం కష్టం అని అంటుంటారు. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి మాటలు పట్టించుకోకుండా మాతృమూర్తిగా నటించింది పార్వతి తిరువోతు. విక్రమ్ హీరోగా రూపొందిన ‘తంగలాన్’ (Thangalaan) సినిమాలో ఆమె తల్లి పాత్రలో కనిపిచనుంది. ఈ విషయం గురించి ఆమె దగ్గర మనసుకు నచ్చితే ఏ పాత్రైనా తప్పక చేస్తానని, ఆ విషయంలో వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోనని క్లారిటీ ఇచ్చేసింది.
‘తంగలాన్’ సినిమాలో గంగమ్మ అనే పాత్రలో నటించానని చెప్పిన ఆమె.. తెర వెనుక కూడా అమ్మ ప్రేమను పంచుతానని అనుకోలేదని చెప్పింది. సినిమాలో తన పాత్రకు చిన్న కుమారుడిగా నటించిన బాలుడు ఓ రోజు సెట్స్‌లో వాళ్లమ్మను చూడగానే ఏడవడం స్టార్ట్ చేశాడట. ఆ తర్వాత బాటిల్‌తో పాలు పట్టించగా.. ఏడుపు ఆపేశాడట. అప్పుడు తాను అమ్మగా ఫీలయ్యానని చెప్పింది పార్వతి.
దాంతో ఆ పాత్రపై మమకారం పెరిగిందట. ఆ అనుభవంతో సందేహాలు లేకుండా ముందుకెళ్లాను అని చెప్పింది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు పా.రంజిత్ (Pa. Ranjith) . విక్రమ్ (Vikram) హీరోగా నటించిన ఈ సినిమాలో పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ (Malavika Mohanan) నటించారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.