బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘పఠాన్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ! ఎప్పుడంటే?

బాలీవుడ్‌కు గత కొన్నేళ్లుగా కనిపించని వసూళ్లను చూపించిన చిత్రమిది. హిట్‌ వస్తే చాలు అనుకుంటున్న బాలీవుడ్‌కి బ్లాక్‌ బస్టర్‌ విజయం అందించిన చిత్రమిది. మా హీరో ఇలా అయిపోయాడేంటి అనుకుంటున్న ఫ్యాన్స్‌ ‘ఇదీ మా హీరో సత్తా’ అని ఘనంగా చెప్పుకున్న చిత్రమిది. టాప్‌ గ్రాసర్ల సినిమా జాబితాను షేక్‌ చేస్తూ టాప్‌లోకి దూసుకెళ్లిన చిత్రమిది. ఇంత చెబుతున్నా.. ఇప్పటికే మీకు ఆ సినిమా ఏంటో తెలిసిపోయి ఉంటుంది. అవును, మీరు అనుకుంటున్నదే ‘పఠాన్‌’.

ఈ సినిమాను థియేటర్లలో మిస్‌ అయిన వాళ్లు సిద్ధమైపోండి ఎందుకంటే మరో పది రోజుల్లో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అవును, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ‘పఠాన్‌’ టీమ్‌ సినిమా ఓటీటీ డేట్‌ను ఫిక్స్‌ చేసింది అని చెబుతున్నారు. అధికారికంగా ఇంకా ఎక్కడా చెప్పలేదు కానీ.. మార్చి 25న సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారట. అమెజాన ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మేరకు త్వరలో ప్రచారం మొదలుపెడతారట.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ గిఫ్‌ను అమెజాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. త్రీఎక్స్‌ అంటూ షారుఖ్‌ ఖాన్‌, దీపికా పడుకొణె, జాన్‌ అబ్రహం ఉన్న గిఫ్‌ అది. జనవరిల 25న విడుదలైన ఈ సినిమా సినిమా ఏకంగా రూ. 1000 కోట్లకుపైగా వసూళ్లు అందుకుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి. పాన్‌ ఇండియా సినిమాలు ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌’, ‘పుష్ప’ ‘కాంతార’ దూసుకుపోతున్న సమయంలో వెలవెలబోయిన బాలీవుడ్‌ ‘పఠాన్‌’తో దూసుకొచ్చింది.

మరిప్పుడు ఓటీటీలో ఏ మేరకు రికార్డులు సాధిస్తుందో చూడాలి. థియేటర్‌ రిలీజ్‌కి ‘పఠాన్‌’ చేసిన ప్రమోషన్స్‌ వైవిధ్యంగా నిలిచాయి. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కి అంతకుమించి అనేలా చేస్తారు అనడంలో సందేహం లేదు. రూ. 240 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1044 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా వసూళ్ల పర్వం కొనసాగుతోంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus