వర్మ సినీ జర్నీ వేడుకకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్, ప్రభాస్
- December 20, 2016 / 06:49 AM ISTByFilmy Focus
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమాల పైరసీ క్యాసెట్లను అద్దెకి తిప్పుకునే కుర్రోడు.. ఇప్పుడు అతన్నే డైరక్ట్ చేస్తున్నాడు. ఇది సినిమా కథ కాదు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితం లోనిది. విజయవాడలో పెరిగిన వర్మ ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఇది తెలువారు ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. విజయవాడలో గొడవల నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన వంగవీటి ఈనెల 23 న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘శివ టు వంగవీటి.. ద జర్నీ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ’ అనే పేరుతో జూబ్లీ హిల్స్ లోని జీఆరేసీ కన్వెన్స్ సెంటర్ లో ఈ రోజు సాయంత్రం ఏడుగంటలు భారీ వేడుక నిర్వహించనున్నారు.
ఈ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథులుగా బిగ్ బీ అమితాబ్, కింగ్ నాగార్జున హాజరుకానున్నారు. వీరితో పాటు మూడేళ్ళుగా ఇతర ఏ సినీ కార్యక్రమాల్లో పాల్గొనని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళితో కలిసి రానున్నారు. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్‌లతో పాటు మరికొంత మంది సినీ నటులు, టెక్నీషియన్లు ఈ ఫంక్షన్‌లో సందడి చేయనున్నారు. మరో విశేషమేమిటంటే ఈ ఫంక్షన్‌కు హాజరుకావాల్సిందిగా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు కూడా ఆహ్వానం అందింది. పవన్ కూడా వచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారని సమాచారం. పవన్ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ షూటింగ్ నిమిత్తం పొలాచ్చిలో ఉన్నారు. వర్మ పిలుపు మేరకు ఆయన వస్తే ఒకే వేదికపై పవర్ స్టార్ ని, యంగ్ రెబల్ స్టార్ ని చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















