పవన్ దెబ్బకు…చెర్రీ షాక్!!!
- November 18, 2016 / 12:45 PM ISTByFilmy Focus
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే…అయితే అదే క్రమంలో ఆ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు వచ్చినా ఆదరించే తత్వం సైతం మెగా అభిమానులకు ఉండడం….ఎంతో గొప్పతనంగా భావించవచ్చు…ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ పరిస్థితి ఒకప్పటిలాగా లేదు…ఏవో తెలియని చిన్న చిన్న మనస్పద్దలు, పైగా వాటిల్లో నిజం ఎంత ఉందో….తెలీదు…కానీ ఏదో తెలియని గ్యాప్ మాత్రం జరుగుతుంది అని మాత్రం అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది…విషయం ఏమిటంటే…టాలీవుడ్ లో అందులోనూ మెగా ఫ్యామిలీలో చిరు, పవన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట….అయితే ఈ వాదనకు ఊతం ఇస్తూ గతంలో అనేక పరిణామాలు జరిగినప్పటికీ…ఆ తరువాత చిరు పవన్ కలవడంతో ఆ అనుమానాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.
ఇదిలా ఉంటే తాజాగా పవన్ కల్యాణ్…బన్నీ కలసి హాజరయిన ఒక పెళ్లి కార్యక్రమంలో బన్నీ పవన్ ను చూసి మరీ దూరంగా ఉండడం, అంతేకాకుండా తాజాగా జరిగిన ఒక కార్యక్రమంతో పవన్ చెర్రీకి షాక్ ఇవ్వడం చూస్తుంటే ఏదో తెలియని వార్ వారి మధ్య జరుగుతుంది అని తెలుస్తుంది….ఇంతకీ పవన్ చెర్రీకి ఇచ్చిన షాక్ ఏంటి అంటే…అప్పట్లో పవన్ నిర్మాణంలో చెర్రీ హీరోగా ఒక సినిమా వస్తుంది అని న్యూస్ వచ్చింది….ఇక దానికి దర్శకుడిగా త్రివిక్రమ్ ఉంటాడు అని కూడా బలంగా వినిపించింది…కానీ ఏం జరిగిందో ఏమో కానీ…అందుకోకుండా..పవన్ తన వీరభక్తుడు నితిన్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ‘రౌడీఫెలో’ దర్శకుడు చైతన్య కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ ఈ సినిమాకు మరో నిర్మాత. అంతేకాదు మూల కధను కూడా త్రివిక్రమ్ అందిస్తున్నాడు…మరి చెర్రీతో సినిమా సంగతి పవన్ ఏం చెయ్యబోతున్నాడో తెలీదు కానీ మొత్తానికి అయితే పవన్ విషయంలో మాత్రం చెర్రీ షాక్ తిన్నాడు అని సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















