Pawan Kalyan, Soundarya: పవన్ కళ్యాణ్ – సౌందర్య.. ఆ కాంబో ఎలా మిస్సయిందంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మంది హీరోయిన్లతో నటించారు. కాజల్ (Kajal Aggarwal), సమంత (Samantha) , శృతి హాసన్ (Shruti Haasan), తమన్నా (Tamannaah Bhatia) , కీర్తి సురేష్ (Keerthy Suresh) వంటి యంగ్ హీరోయిన్లతో పాటు సీనియర్ తారలు దేవయాని (Devayani) , రేణు దేశాయ్ (Renu Desai), రాశీ (Raasi) వంటి వారితో కూడా పలు సినిమాలు చేశారు. అయితే ఒక అత్యద్భుతమైన కాంబినేషన్ మాత్రం సెట్ కాలేదు – పవన్ కళ్యాణ్, సౌందర్య (Soundarya) . సౌందర్యతో పవన్ కళ్యాణ్ జోడీ బాగా సెట్ అవుతుందని ‘సుస్వాగతం’ (Suswagatham) సినిమాలో ఆమెను హీరోయిన్ గా అనుకున్నారు.

Pawan Kalyan, Soundarya:

ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు (Bhimaneni Srinivasa Rao) దర్శకుడు, పవన్ కళ్యాణ్ జోడీగా సౌందర్య అయితే సినిమాకి ప్రత్యేక స్థాయి ఉంటుందని భావించారు. కానీ పవన్ ఆ సినిమాలో సౌందర్యతో నటించడానికి నో చెప్పారట. సౌందర్య అంటే పవన్ కు ఎంతో గౌరవం. ఆమె ముందు నటించలేను అని, తాను తగ్గిపోతానని, ఆమెతో పోటీ పడలేనని ఓపెన్ గా చెప్పారట. దాంతో సౌందర్య స్థానంలో దేవయానిని తీసుకొచ్చారు. సినిమా బాగా విజయవంతమైంది.

పవన్ అప్పుడు కొత్తగా ప్రేక్షకుల దృష్టిలోకి వచ్చిన స్టార్ గా ఎదుగుతున్నాడు, ‘సుస్వాగతం’తో హిట్ల పరంపర మొదలు పెట్టాడు. ఈ సినిమా తరువాత పవన్ వరుస విజయాలతో ‘తొలిప్రేమ’ (Tholi Prema) , ‘తమ్ముడు’ (Thammudu) , ‘బద్రి’ (Badri) , ‘ఖుషి’ (Kushi) వంటి చిత్రాలతో బాక్సాఫీస్ ను శాసించాడు. పవన్ సౌందర్యతో సినిమా చేసి ఉంటే ఆ కాంబినేషన్ ఎంత అద్భుతంగా ఉండేదో అని ఫ్యాన్స్ ఆలోచిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

ఒకవేళ పవన్ సౌందర్యతో కలిసి నటించి ఉంటే ఆ సినిమా మరింత హై లెవెల్ లో ఉండేదని చెప్పవచ్చు. ‘సుస్వాగతం’ హిట్టుతో పవన్ కల్యాణ్ స్టార్ డమ్ పెరగడంతో, అప్పటి నుండి ఆయన క్రేజ్ మరింత పీక్ కి చేరుకుంది. ఇప్పుడు పవన్ రాజకీయాల్లో ఉండగా, ‘ఓజీ’ (OG Movie) , ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) వంటి సినిమాలను లైన్ లో పెట్టాడు.

ప్రభాస్ కొత్త లుక్ కోసం ఎలా సిద్ధమవుతున్నాడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus