Pawan Kalyan,Surendar Reddy: పవన్-సురేందర్ రెడ్డి సినిమా ఆగిపోయిందా..?
- March 11, 2022 / 02:17 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మలయాళ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు పవన్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా ఒప్పుకున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా మొదలవుతుందని అన్నారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ఇటీవల సురేందర్ రెడ్డి.. పవన్ ను కలిసి పూర్తి కథను వినిపించారట. స్క్రిప్ట్ పవన్ కి పెద్దగా నచ్చకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారని సమాచారం. నిర్మాత రామ్ తాళ్లూరి మాత్రం మరో డైరెక్టర్ ని వెతికే పనిలో పడ్డారు.

పవన్ తో సినిమా చేసే ఛాన్స్ మిస్ చేసుకోవాలనుకోవడం లేదు నిర్మాత. అందుకే డైరెక్టర్ ని మార్చి కొత్త స్క్రిప్ట్ తో పవన్ ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ ఇటీవల మరో రీమేక్ ‘వినోదయ సీతం’లో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేస్తారని సమాచారం.

ఈ సినిమాలో పవన్ సరికొత్తగా కనిపించబోతున్నారట. తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రీమేక్ పవన్ కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి!
రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

















