Bheemla Nayak: ఆ భాషలో భీమ్లా నాయక్ సక్సెస్ అవుతుందా?

ఈ ఏడాది థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో భీమ్లా నాయక్ సినిమా కూడా ఒకటి. సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పవన్ అభిమానులకు ఎంతగానో నచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కథలో మార్పులు చేయడం ఈ సినిమాకు ప్లస్ అయింది. అయితే సెప్టెంబర్ 9వ తేదీన తమిళంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

భీమ్లా నాయక్ తమిళ్ వెర్షన్ ఆహా ఓటీటీలో రిలీజ్ కానుండటం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. తమిళంలో ఓటీటీలో రిలీజవుతున్న ఈ సినిమా అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే ఆహా ఓటీటీలో ఈ సినిమా తమిళంలో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. తమిళం వచ్చిన పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తమిళంలో కూడా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు సినిమాలో పవన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడం వల్ల కొన్ని ఏరియాలలో మాత్రం ఈ సినిమా బయ్యర్లు స్వల్పంగా నష్టపోయారు.

మరోవైపు సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. హరిహర వీరమల్లు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. 2023 సంవత్సరంలో హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus