Bro Movie: అక్కడ కూడా సత్తా చాటుతున్న పవన్.. ఈ స్థాయిలో ఫాలోయింగా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ మిక్స్డ్ టాక్ తో ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇతర రాష్ట్రాల్లో సైతం బ్రో సినిమాకు అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లు వస్తుండటం గమనార్హం. అయితే గుజరాత్ లో బ్రో మూవీ థియేటర్ హౌస్ ఫుల్ కాగా పవన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతర హీరోల ఫ్యాన్స్ ను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

ఇతర రాష్ట్రాల్లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కు మాత్రమే సొంతమని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ లో పవన్ కళ్యాణ్ ఫ్లకార్డులు సైతం బ్రో సినిమాను ప్రదర్శితున్న థియేటర్ దగ్గర దర్శనమిచ్చాయి. సీఎం పవర్ స్టార్ అంటూ కొంతమంది అభిమానులు అక్కడ నినాదాలు చేయడం గమనార్హం. పవన్ పాపులారిటీ అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

పవన్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాకముందే పవర్ స్టార్ కు ఈ రేంజ్ లో క్రేజ్ సొంతమైంది. పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలై సక్సెస్ సాధిస్తే మాత్రం ఆ క్రేజ్ మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ రానుందని సమాచారం అందుతోంది.

ఓజీ సినిమా డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కుతోంది. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా పవన్ కు మరో సక్సెస్ సాధించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉండగా పవన్ తో సినిమాలను నిర్మించడానికి క్యూ కడుతున్న నిర్మాతల సంఖ్య ఎక్కువగానే ఉంది. పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus